వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ సినిమాలపై పాకిస్తాన్ ప్రతాపం: మన ఎయిర్ ఫోర్స్ గురించి వెతికిన పాకిస్తానీలు

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దాదాపు మూడు వందల మంది తీవ్రవాదులు చనిపోయి ఉంటారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్.. భారత్‌పై ఆగ్రహంతో ఉంది.

బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరాలను భారత వాయు సేన విమానాలు ధ్వంసం చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. భారత్ దాడిని తిప్పికొట్టలేకపోయామన్న అసహనం కనిపిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌లో భారతీయ చిత్రాలను నిషేధించారు.

Pakistan bans Indian movies in the wake of IAF air strike

భారత సినిమాలే కాకుండా భారత్‌లో రూపొందిన వాణిజ్య ప్రకటనల పైనా ఈ నిషేధం వర్తిస్తుందని పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌధరీ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.

పాకిస్థాన్ సినిమా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ భారతీయ చిత్రాలను ప్రదర్శించకూడదని నిర్ణయించుకుందని, పాకిస్థాన్‌లో ఇకపై ఏ భారతీయ చిత్రం విడుదల కాదని, అలాగే భారత్‌లో చిత్రీకరించిన యాడ్ ఫిలింస్ కూడా ప్రసారం చేయరాదని ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు.

మన ఎయిర్ ఫోర్స్ గురించి వెతికిన పాకిస్థానీలు

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పరిధిలోకి వెళ్లి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనేక పదాలు ట్రెండింగ్‌లో నిలిచాయి. అయితే పాకిస్థాన్‌ ప్రజలు ఆ దేశ వైమానిక దళం(పీఏఎఫ్) కంటే భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అనే పదం మీద ఎక్కువ ఆస్తకి చూపారు. గూగుల్‌లో భారత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఎక్కువగా వెతికారు. ఈ విషయం గూగుల్ ట్రెండ్స్‌ విశ్లేషణలో తేలింది.

అలాగే వీటితో పాటు బాలాకోట్, సర్జికల్ స్ట్రైక్స్‌, ఎల్ఓసీ అనే పదాలు ట్రెండింగ్‌లో నిలిచాయి. మన దేశంలో సర్జికల్ స్ట్రైక్స్‌ అనే పదం గురించి ఎక్కువగా వెతగ్గా, పాకిస్తాన్‌లో మాత్రం బాలాకోట్ గురించి ఎక్కువ మంది వెతికారు.

ఈ రోజు ఉదయం భారత్‌ వైమానిక దాడులు జరిపిందని మన మీడియా, వాటిని తిప్పికొట్టామని పాకిస్తాన్ మీడియా చెప్పడంతో గూగుల్‌లో వెతికారు. పాక్‌లో బాలాకోట్ పదం చాలా త్వరగా ట్రెండ్ అయింది. భారత్‌ లో ఇదే పదం కాస్త ఆలస్యంగా ట్రెండ్ అయింది. అలాగే పాకిస్థాన్ ఆర్మీ కంటే పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌ పదం కాస్త ఎక్కువగా ట్రెండ్ అయ్యింది.

English summary
Choudhary Fawad Hussain, Pakistan I&B Minister: Cinema Exhibitors Association has boycotted Indian content, no Indian movie will be released in Pakistan. Also have instructed PEMRA to act against made in India advertisements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X