వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు పాకిస్థాన్ చర్యలు: డీ రాడికలైజెషన్ క్యాంపులు, ఒక్కో కేంద్రంలో 700 మందికి

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్‌లో ఉగ్రవాదానికి ఆకర్షితులైన యువతను వెనక్కి పంపించేందుకు (డీ రాడికలైజేషన్) క్యాంపులను నిర్వహిస్తున్నారని భారత నిఘా విభాగం గుర్తించింది. అయితే ఇది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావాత్ కశ్మీర్‌లో డీ రాడికలైజేషన్ క్యాంపులు నిర్వహిస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. పాకిస్థాన్ ఆ దిశగా అడుగులు వేసింది. అతివాద భావజాలంతో ఉగ్రవాదానికి ఆకర్షితులయ్యే వారిని పాకిస్థాన్‌లోని క్యాంపుల్లో చేరుస్తున్నట్టు తెలుస్తోంది.

ఒక్కో క్యాంపులో 700 మంది

ఒక్కో క్యాంపులో 700 మంది

పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ ఫంక్తువాలో పదుల సంఖ్యలో ఉగ్రవాద నిరోధక క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపులో 700 మందికి అతివాద భావజాలం నుంచి విముక్తి కలిగించేలా శిక్షణ ఇస్తారు. పాకిస్థాన్‌లో ఉన్న డీ రాడికలైజేషన్ క్యాంపుల శాటిలైట్ ఇమేజ్‌ను భారత నిఘా విభాగం విడుదల చేసింది.

 ఉగ్రవాదం నుంచి

ఉగ్రవాదం నుంచి

ఆయా క్యాంపుల్లో ఆధునాతన మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అందులో అతివాద భావజాలంతో ఉన్న యవతకు శిక్షణ అందజేస్తున్నారు. వారిని క్రమంగా మార్చివేసి.. ఉగ్రవాదం నుంచి సత్ప్రవర్తన కలిగిన వారీగా తీర్చిదిద్దుతున్నారు. దీంతోనైనా పాకిస్థాన్‌లో ఉగ్రవాదం తగ్గుతోందని ఆ దేశం భావిస్తోంది.

 92 శాతం మంది..

92 శాతం మంది..

ఆయా క్యాంపుల్లో 92 శాతం మంది 35 ఏళ్ల వయస్సు ఉన్న వారు కావడం విశేషం. మిగిలిన 12 శాతం మంది యువకులు అని ఇంటిలెజెన్స్ విభాగం పేర్కొన్నది. ఉగ్రవాద నియంత్రణ కోసం పాకిస్థాన్ ఇన్ని చర్యలు తీసుకుంటున్న.. ఆ దేశంలో ఉగ్రవాదం ఆగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని డీ రాడికలైజెషన్ క్యాంపులు నిర్వహించినా ఉగ్రవాదులు తగ్గడం లేదని, దాడులు యదేచ్చగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

English summary
thousands of young men in Pakistan lured by terrorists are being taken to centres called 'deradicalisation camps' that are packed to strength.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X