వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విట్టర్లో మండిపాటు: అనుపమ్‌ఖేర్‌కు పాక్‌ వీసా నిరాకరణ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌కు పొరుగు దేశం పాకిస్థాన్ వీసా నిరాకరించింది. ఈ నెల 5న కరాచీలో నిర్వహిస్తున్న సాహిత్స సదస్సుకు అనుపమ ఖేర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇందు కోసం ఆయన భారత నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే భారత్ బృందంతో పాటుగా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే 18 మంది సభ్యుల భారత్ బృందంలో అనుపమ్ ఖేర్‌కు మినహా మిగతా 17 మందికి పాకిస్థాన్ వీసాలు ఇచ్చింది. అనుపమ్ ఖేర్‌కు పాకిస్థాన్ వీసా నిరాకరించినట్టు వచ్చిన వార్తలపై పాక్ అధికారులు స్పందించారు. అనుపమ్ ఖేర్ అసలు వీసాకి దరఖాస్తు చేసుకోలేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తామెలా వీసా నిరాకరిస్తామని ప్రశ్నించారు.

Pakistan denies Anupam Kher visa to attend Karachi lit fest

'వీసాకి దరఖాస్తు చేసుకున్నట్టు ఏదైనా ఆధారం ఉందేమో మీరు సరిగా చూసుకోండి' అని పాక్ హై కమిషన్ ప్రధాన కార్యదర్శి అలీ మెమన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తనకు పాకిస్థాన్ తనకు వీసా నిరాకరించడంపై అనుపమ్ ఖేర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ చాలా బాధ కలిగించిందని, ఎంతో నిరుత్సాహపడ్డానని చెప్పారు.

భారత ప్రభుత్వం పాకిస్థాన్ సంతతికి చెందిన చాలా మంది రచయితలు, ఆర్టిస్ట్‌లు, హీరోలకు స్వాగతిస్తుందన్నారు. కానీ పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం తనకు వీసా నిరాకరించిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత సంస్కృతి సంప్రదాయాలను కరాచీలోని ఫెస్టివల్ ప్రస్తావిస్తాననా? లేక కాశ్మీరీ పండిట్‌ను అయినందుకా? అని ప్రశ్నించారు.

పాక్ వీసా నిరాకరణపై నిజానిజాలను మీడియాకు తెలియజేసేందుకు సాయంత్రం 5.30 గంటలకు ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

English summary
Pakistan on Tuesday denied a visa to actor and BJP sympathiser Anupam Kher, who has been invited by the organisers of a literary festival in Karachi as one of their guests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X