వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు నో చెప్పిన పాక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐస్‌లాండ్ పర్యటన సందర్భంగా పాక్ గగనతలంకు రాష్ట్రపతి విమానం ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ చేసుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ శనివారం చెప్పారు. సోమవారం నుంచి రాష్ట్రపతి ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, స్లోవేనియా పర్యటన కోసం వెళుతున్నారు. ఈ పర్యటనల్లో ఆయన ఆయా దేశాధినేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన పుల్వామా దాడుల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై వారితో చర్చించనున్నారు.

రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్‌ విమానంకు తమ గగనతలంలో ఎగిరేందుకు భారత్ చేసుకున్న దరఖాస్తును ఇమ్రాన్‌ఖాన్ తిరస్కరించారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషీ తెలిపారు. ఇప్పటికే భారత్ పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాక్ నుంచి వచ్చిన ఈ సమాధానంతో భారత్ ఆగ్రహంతో ఉంది. ఇదిలా ఉంటే బాలాకోట్ దాడుల తర్వాత పాకిస్తాన్ తమ గగనతలంను భారత విమానాలకు పూర్తిగా మూసివేసింది. అయితే జూలై 16న తిరిగి తెరిచినప్పటికీ ఆ తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మళ్లీ పాక్ ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే భారత్ నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లాల్సిన విమానాలు తమ సర్వీసులను రద్దు చేశాయి.

ramnath

జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో భారత్‌పై పీకల్లోతు ఆగ్రహం పెంచుకుంది పాకిస్తాన్. ఇక అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా భారత్‌ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది. ఈ క్రమంలోనే పిచ్చిప్రేలాపనలకు పోతోంది పాకిస్తాన్. కశ్మీర్ సాధనకోసం అవసరమైతే భారత్‌పై అణుయుద్దం చేసేందుకైనా సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పిచ్చి ప్రకటనలు చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి భారత్‌కు రైలు సర్వీసులు, బస్సు సర్వీసులు రద్దు అయ్యాయి. అంతేకాదు వాణిజ్య సంబంధాలను కూడా పాక్ వద్దనుకుంది.

English summary
Amid escalating tensions, Pakistan on Saturday denied President Ram Nath Kovind permission to fly through its airspace access to which is usually granted due to New Delhi's recent "behaviour". "The decision has been taken in view of India's behaviour," Pakistani Foreign Minister Shah Mehmood Qureshi said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X