వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ గరం గరం.. యూఎన్ఓకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

UNOకు ఫిర్యాదు చేస్తామని పాక్ వార్నింగ్ || Imran Khan Fires On Modi Government Decision On Kashmir

ఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ అగ్గి మీద గుగ్గిలమవుతోంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మోడీ సర్కారు ఒంటెత్తు పోకడలకు పోతోందని ఆరోపిస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాలను భారత్ తుంగలో తొక్కుతోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ నిర్ణయంపై ఐక్య రాజ్యసమితికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పింది.

కాశ్మీరీల ఆకాంక్షలకు వ్యతిరేకంగా భారత నిర్ణయం

కాశ్మీరీల ఆకాంక్షలకు వ్యతిరేకంగా భారత నిర్ణయం

మ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ తీవ్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత ఆక్రమిత కాశ్మీర్ విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏకపక్షమని మండిపడ్డారు. భారత్ చర్య భద్రతా మండలి తీర్మానం, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకమని ఆరిఫ్ అల్వీ విమర్శించారు. కాశ్మీరీ ప్రజల ఆశలకు అనుగుణంగా చేసే తీర్మానాలకు తమ మద్దతుంటుందే తప్ప స్వార్థం కోసం తీసుకునే నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని పాక్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు.

ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు?

ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు?

జమ్మూ కాశ్మీర్ విషయంలో మోడీ సర్కారు నిర్ణయం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అప్రమత్తమయ్యారు. అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అమిత్ షా రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే ఆయన మంత్రివర్గంతో భేటీయై ఈ అంశంపై చర్చించారు. మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం, దాని పర్యవసానాలు, భవిష్యత్ కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహంపై ఇమ్రాన్ ఖాన్ మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి ధీటైన సమాధానం ఇవ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సమస్య అయిన కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 భారత్ రద్దు చేయడాన్ని ఐక్య రాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉన్న కాశ్మీర్ అంశంపై భారత్ ఏకపక్షంగా వ్యవహరించిందని ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

సమస్య పరిష్కారానికి సిద్ధమన్న పాకిస్థాన్

సమస్య పరిష్కారానికి సిద్ధమన్న పాకిస్థాన్

కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. అంతర్జాతీయ వివాదైన కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందని ఆరోపించింది. ఈ వివాదంతో సంబంధమున్న తాము భారత్ నిర్ణయాలపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

English summary
Pakistan president says India's attempt to further change status of Indian Occupied Jammu & Kashmir is against the resolutions of UNSC & against wishes of the Kashmiri people. Pakistan supports & insists on a peaceful resolution based on wishes of Kashmiri people & stands with them in their hour of need
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X