వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైమానిక దాడులతో చెట్లకు నష్టం వాటిల్లిందట .. అభినందన్ పై కేసు నమోదుచేసిన పాకిస్థాన్

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో వైమానిక దాడుల తర్వాత ఉక్కిరి బిక్కిరవుతోన్న పాకిస్థాన్ .. ప్రతీకరా చర్యలకు దిగుతోంది. దాడుల మరునాడే యుద్ధ విమానాలతో దాడికి దిగిన దాయాది చర్యను భారత వింగ్ కమాండర్ అభినందన్ ధీటుగా తిప్పికొట్టారు. అధికారికంగా ఏమీ చేయలేని పాకిస్థాన్ .. లోపాలను ఎత్తిచూపుతూ అభినందన్ పై కేసు నమోదు చేసింది.

అటవీ సంపదకు నష్టం వాటిల్లిందట ..
వైమానిక దళ మెరుపుదాడులో పాకిస్థాన్ లోని అటవీ సంపదకు నష్గం వాటిల్లిందట. ఈ క్రమంలో వైమానిక దాడులు చేసిన పైలట్లపై పాకిస్థాన్ అటవీశాఖ కేసు నమోదు చేసింది. దీంతో తమ భూభాగంలోని 19 చెట్లు ధ్వంసమయ్యాయని తన ఫిర్యాదులో పేర్కొన్నది. భారత్ దాడులతో బాలాకోట్ లో పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. దీంతో దేశం ఎంతో నష్టపోయిందని సెలవిచ్చారు ఆ దేశ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ మాలిక్ అమీన్.

pakistan forest department register case indian air force

ఐక్యరాజ్యసమితిలో కూడా ఫిర్యాదు ..
పాకిస్థాన్ అటవీశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది గాక .. ఐక్యరాజ్యసమితిలో కూడా కంప్లైంట్ చేయాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ చర్యతో అంతర్జాతీయ సమాజంలో భారత్ చేసిన నష్టాన్ని తెలియజేయాలనే కృతనిశ్చయంతో ఉంది పాకిస్థాన్.

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం : అయోధ్య మధ్యవర్తిత్వానికి మీడియా దూరం ... కారణాలివే ..?సుప్రీంకోర్టు కీలక నిర్ణయం : అయోధ్య మధ్యవర్తిత్వానికి మీడియా దూరం ... కారణాలివే ..?

ఏకాకి అయినందునే చర్యలు ..?

ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ .. పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై అంతర్జాతీయ సమాజంలో వ్యతిరేకత వచ్చింది. పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరలపై భారత వైమానిక దళం చేసిన దాడిని ప్రపంచ దేశాలు సమర్థించాయి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందేనని స్పష్టంచేశాయి. అమెరికా, రష్యా, కెనడా తదితర అగ్రదేశాలు ఐక్యరాజ్యసమితి .. పాక్ ను అన్నింటిలో వెనుకెసుకొచ్చే చైనా కూడా ఆ దేశ ద్వంద్వ నీతిని ఎండగట్టాయి. ఈ క్రమంలో తమకు అంతర్జాతీయ సమాజం నుంచి అన్నిరకాలుగా వ్యతిరేకత వచ్చినందున .. చెట్లకు నష్టం వాటిల్లిందని యూఎన్ వో ను ఆశ్రయించాలని పాకిస్థాన్ భావిస్తోంది. కానీ పాకిస్థాన్ ఈ కపట నీతిని ఐక్యరాజ్యసమితి సహా అగ్రదేశాలు పెద్దగా పట్టించుకోవనే రాజకీయ విశ్లేషకులు, మేధావులు భావిస్తున్నారు.

English summary
Pakistani Forest Department has registered a case against Indian pilots who carried out air strikes. In his complaint, he said that 19 trees in their land were destroyed. In Balakot with tens of Indians, tens of trees fell. The country has lost of money, "said Malik Amin, the Climate Change Secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X