వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సర్జికల్ స్ట్రయిక్స్: పాక్‌ తదుపరి స్టెప్‌పై సర్వత్రా ఆసక్తి?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)ని దాటుకుని భారత సైన్యం గురువారం తెల్లవారుజామున పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. కంటి మీద కనుకు లేకుండా చేస్తున్న చొరబాటుదారులను దేశంలోకి చోరబడకముందే మట్టుబెట్టింది.

భారత సైన్యం చేసిన దాడుల్లో పాకిస్థాన్‌కి చెందిన 38 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. యూరీ సైనిక స్థావరంపై విరుచుకుపడి 18 మంది సైనికులను బలితీసుకున్న ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకే చేసిన ఈ దాడులు భారతీయులకు సంతోషాన్ని కలిగించొచ్చు.

అయితే భారత సైన్యం చేసిన మెరుపుదాడులతో పాకిస్థాన్‌ ప్రతీకారానికి దిగితే ఏం జరుగుతుంది? ఆ దేశం ఎలా స్పందిస్తుంది? ఏం చేయగలదు? అన్న ప్రశ్నలు ఇప్పుడు యావత్ భారత ప్రజల్లో ఆసక్తి రేపుతున్నాయి.

 భారత్‌లో ఉగ్రవాద దాడులకు పాక్ ప్రోత్సాహం

భారత్‌లో ఉగ్రవాద దాడులకు పాక్ ప్రోత్సాహం


భారత్‌లో ఉగ్రదాడులు చేయాలని ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రోత్సహించే అవకాశం లేకపోలేదు. భారత సైన్యం దాడులతో దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో ఉగ్రవాద దాడులు జరగొచ్చని భారత నిఘా వ్యవస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. గురువారం ఆర్మీ డీజీఎంవో రణబీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు మెట్రో నగరాలపై దాడులకు కుట్ర పన్నారని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

దాడులు జరగలేదని తేలిగ్గా కొట్టిపారేసింది

దాడులు జరగలేదని తేలిగ్గా కొట్టిపారేసింది

ఉగ్రవాదుల స్థావరాలపై దాడులే జరగలేదని పాకిస్థాన్ మీడియా ఇప్పటికే చెబుతోంది. ఇది పాక్ ప్రజలతో పాటు ఉగ్రవాదులను సంతోషపెట్టే వార్త. అయితే భారత్‌ దాడి చేసిందని చెబితే నిద్రపోతున్న సమయంలో భారత సైన్యం దెబ్బతీసిందని అంగీకరించాల్సి వస్తుంది. అమెరికా, చైనా లాంటి దేశాలు భారత్‌కే మద్దతుగా నిలవడం పాక్ కు మింగుడుపడని విషయం.
 భారత్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం

భారత్‌పై సైనిక చర్యకు దిగే అవకాశం

అధికారికంగా లేదా అనధికారికంగా భారత్‌పై సైనికచర్యకు దికే అవకాశం లేకపోలేదు. నిజానికి దౌత్యపరమైన విధానాలకు పాకిస్థాన్ ఎన్నడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. కార్గిల్‌ యుద్ధమే దీనికి నిదర్శనం. పౌర దుస్తుల్లో వెళ్లి కార్గిల్‌ను ఆక్రమించుకోవాలని అప్పటి పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ సైన్యాన్ని ఆదేశించారు. అప్పట్లో అందరినీ భారత్‌ సైన్యం, వాయుసేన మట్టుబెట్టింది. అయితే ఇప్పుడు భారత్ పైకి పాక్ సైనిక చర్యకు దిగితే సమర్థించుకునే అవకాశం కూడా తక్కువే. ఎందుకంటే భారత్‌ పీఓకేలో దాడి చేసింది కాబట్టి. పీఓకే హక్కులు తమకే హక్కులున్నాయని భారత్‌ ప్రకటించుకుంటోంది.

 అఫ్గానిస్థాన్‌లో సమస్యలు సృష్టించటం

అఫ్గానిస్థాన్‌లో సమస్యలు సృష్టించటం


భారత్‌కు సన్నిహితంగా ఉన్న అఫ్గానిస్థాన్‌లో పాకిస్థాన్ సమస్యలు సృష్టించే అవకాశం లేకపోలేదు. పాకిస్థాన్ ఇప్పటికే ఆ దేశంలో సమస్యలను సృష్టించటానికి ప్రయత్నిస్తోంది. అయితే భారత్ అడుగుజాడల్లో అఫ్గనిస్థాన్‌ సార్క్‌ సమావేశాన్ని బహిష్కరించటాన్నీ పాక్‌ అవమానంగా భావిస్తోంది.

 అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం

అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం


పాకిస్థాన్‌ రక్షణమంత్రి ఇటీవల మాట్లాడుతూ అణ్వాయుధాలు గురించి ప్రస్తావించారు. అయితే అణ్వాయుధాల ప్రయోగానికి అమెరికా, చైనాలు అంగీకరించకపోవచ్చు. అయినా బేఖాతరు చేసి అణ్వాయుధాలను ముందుగా ప్రయోగిస్తే ప్రతిగా భారత్‌ అణ్వాయుధాలను ప్రయోగించినా ఇతర దేశాలేవీ అభ్యంతరం తెలపకపోవచ్చు. అప్పుడు పాక్‌ కనీవినీ ఎరగని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.

English summary
India conducted "surgical strikes" across the Line of Control (LoC) in Jammu and Kashmir on terrorist hideouts in Pakistan-Occupied Kashmir (PoK) and killed several terrorists, the Army's Director General of Military Operations (DGMO) said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X