వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది..! ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ వేడుకుందన్న మోదీ..!!

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్‌/హైదరాబాద్ : గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి గురించి ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటూ భారత్‌ను పాకిస్థాన్‌ బహిరంగంగా వేడుకోవాల్సి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం గుజరాత్‌లోని అమ్రేలీలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ..

బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన అనంతరం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ప్రకటనపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లోని రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లపాటు బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు. గుజరాత్‌లోని సర్దార్ పటేల్‌ విగ్రహం.. నెహ్రూని అగౌరవపర్చడానికి నిర్మించిన విగ్రహం కాదని మోది తెలియజేసారు.

Pakistan got the bargaining legs!Pak plead to reduce tensions..!-says Modi..!!

సర్దార్‌ పటేల్‌ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయి ఉంటే, ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు గుజరాత్‌ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టును 40 ఏళ్ల క్రితమే పూర్తి చేసి ఉంటే గుజరాత్‌ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండేవని అన్నారు. నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా వేరే వారిని కనీసం ఐదేళ్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకోగలరా? అని ప్రశ్నించారు.

గుజరాత్‌లో తాను నేర్చుకున్న విషయాలు తనకు చాలా ఉపయోగపడుతున్నాయని మోదీ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. 2017లో డోక్లాంలో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో అవి బాగా ఉపయోగపడ్డాయి అని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, లోక్‌సభ మూడోదశ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని 26 స్థానాలకు ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరగనుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ గెలుపొందింది.

English summary
Prime minister Modi speaking at a rally organized by the Bharatiya Janata Party (BJP) during in Amritsi in Gujarat on Thursday in connection with the Lok Sabha elections.Prime Minister Narendra Modi has said that Pakistan should publicly call India to curb tensions between the two countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X