వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిషేధిత ఉగ్రవాద సంస్థలపై చర్యలు చేపట్టిన పాకిస్థాన్ ,పలువురి నిర్భంధం

|
Google Oneindia TeluguNews

భారత ఓత్తిడిలతోపాటు అంతర్జాతీయ సమాజంలో ఏకాకైన పాకిస్థాన్ ఉగ్రవాదంపై చర్యలు చేపడుతుంది. నిషేధిత ఉగ్రవాద సంస్థలు నడుపుతున్న పలు సంస్థలను తమ స్వాధీనంలోకి తీసుకుంటూనే వాటికి భాద్యుల వారిపై చర్యలు చేపట్టింది.

ముంబై మారణహోమ సూత్రధారికి ఐక్యరాజ్య సమితిలో ఎదురుదెబ్బ: పేరు తొలగింపునకు ససేమిరా ముంబై మారణహోమ సూత్రధారికి ఐక్యరాజ్య సమితిలో ఎదురుదెబ్బ: పేరు తొలగింపునకు ససేమిరా

ఉగ్రవాద సంస్థలకు చెందిన మదర్సాలను స్వాధీనం చేసుకున్న పాక్

ఉగ్రవాద సంస్థలకు చెందిన మదర్సాలను స్వాధీనం చేసుకున్న పాక్

నిషేధిత ఉగ్రవాద సంస్థలపై పాక్‌ చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగానే 182 మదర్సాలను తమ అధీనంలోకి తీసుకున్నామని, అలాగే, మదర్సాలకు ,మరియు పలు తీవ్రవాద సంస్థలకు చెందిన 121 మందిని అదుపులోకి తీసుకున్నామని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.అయితే పాకిస్థాన్ లోని ఆయా సంస్థలపై తమ ప్రణాళికలో భాగంగానే వారిపై చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది. కాని అంతార్జతీయ ఒత్తిడికి గాని ,భారత్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకోలేదని చెప్పింది..

పలు స్కూళ్లు ,కాలేజీల స్వాధీనం,

పలు స్కూళ్లు ,కాలేజీల స్వాధీనం,

మత సేవల పేరిట జైష్‌ ఎ మహ్మద్‌తో పాటు పలు నిషేధిత ఉగ్రసంస్థలు పాకిస్థాన్ మదర్సాలను నడుపుతున్నాయి. మదర్సాలలో లక్షల మందికి విద్యను అందిస్తున్నాయి..వీటి ద్వార యువతలో ఉగ్రవాద భావాలు నింపుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి..ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ వాటిపై ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తోంది..దీంతో పాక్ లోని 182 మదర్సాలను తమ ఆదీనంలోకి తీసుకోవడమే కాకుండా నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన మరో 34 స్కూళ్లను, కాలేజీలు, 163 ఆసుపత్రులు, 184 అంబులెన్స్ కూడ పాకిస్తాన్ తన నియంత్రణలోకి తీసుకున్నామని తెలిపింది.

భారత్ ,మరియు అంతర్జాతీయ ఒత్తిడి ఎఫెక్ట్

భారత్ ,మరియు అంతర్జాతీయ ఒత్తిడి ఎఫెక్ట్

కాగా కాగా, ఇటీవల పాక్‌... నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టైన వారిలో జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్ర సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు ముఫ్తీ అబ్దుర్‌ రౌఫ్‌తో పాటు ఉగ్రవాద కీలక నేత హమ్మద్‌ అజార్ కూడా ఉన్నాడు. అలాగే, కొన్ని రోజులుగా ఆయా సంస్థలకు చెందిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్‌పై ఒత్తిడి పెరిగింది.

English summary
Pakistan intensified its crackdown against Islamist militants on Thursday, with the government announcing it had taken control of 182 religious schools and detained more than 100 people as part of its push against banned groups.but The interior ministry said it was part of a long-planned drive
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X