వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ మాదే పాకిస్థాన్‌తో సహ, ఏ దేశం జోక్యం చేసుకోవద్దు...! రాహుల్ గాంధీ యూటర్న్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కశ్మీర్ అంశంపై ఇన్నాళ్లకు ఓ క్లారిటికి వచ్చారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. ఓవైపు కేంద్రం కశ్మీర్ అంశంలో పలు దేశాల మద్దతు కూడగట్టడడంతో పాటు, కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. కాని స్వదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది.. దాయాదీ పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందంటే అర్థం ఉంది.. కాని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్వతిరేకిస్తుందో అర్థం కాని పరిస్థితి కొంతమంది స్వంత పార్టీ నేతల్లో నెలకొంది..దీంతో ప్రజల్లో పలుచన అయ్యో అవకాశాలు ఉండడంతో రాహుల్ గాంధీ ఎట్టకేలకు కశ్మీర్ అంశంపై పాజీటీవ్ సంకేతాలను ఇచ్చారు.

కశ్మీర్ భారత అంతర్గత అంశం.. రాహుల్ గాంధీ

కశ్మీర్ భారత అంతర్గత అంశం.. రాహుల్ గాంధీ

ఆగస్టు 5వ తేదీన కశ్మీర్ అంశంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారిగా సానూకూలంగా స్పందించారు. పార్టీ పరంగా కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పిన రాహుల్ గాంధీ, కశ్మీర్ పూర్తిగా అంతర్గత అంశమని స్పష్టం చేశారు. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌ సహ ఇతర దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌ మద్దతు వల్లే కశ్మీర్‌లో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందనేది ప్రపంచానికి తెలిసిందే కదా అంటూ ట్వీట్టర్లో పేర్కోన్నారు.

 స్వంత పార్టీ నేతల వ్యతిరేకత నుండి బయట పడేందుకు కాంగ్రెస్ వ్యూహం

స్వంత పార్టీ నేతల వ్యతిరేకత నుండి బయట పడేందుకు కాంగ్రెస్ వ్యూహం


మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ బీజేపీ దారికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దును కూడ కాంగ్రెస్ పార్టీలోని మేధావి వర్గం అయిన శశీథరూర్,జైరాం రమేష్‌తో పాటు ఇతర సీనియర్లు కూడ బీజేపీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంపై అంతర్గతంగా పార్టీలో కూడ విభేధాలు బయటపడ్డాయి. దీంతో అప్రమమత్తమైన కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో మెజారీటీ ప్రజలు మద్దతు పలుకుతున్న కశ్మీర్‌పై తాను సైతం అంటూ స్వరం మార్చింది.
ఇన్నాళ్లు మేము వ్యతిరేకిస్తుంది ఆర్టికల్ 370 రద్దు ప్రక్రియను తప్ప కశ్మీర్ అంశం భారత అంతర్గభాగమని చెబుతున్నారు. అయితే ఇదే అంశాన్ని శశిథరూర్ లాంటీ మేధావి వర్గాలు మొదటి నుండి చెబుతున్నప్పటికి ఉన్నత స్థాయిలో ఉన్న రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీగాని ఈ అంశాన్ని స్పష్టం చేయాలేదు.

ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్

ఆర్టికల్ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్


కాగా కేంద్ర తీసుకునే పలు అంశాలను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇటివల కశ్మీర్‌లో పర్యటించేందుకు వెళ్లింది. ప్రతిపక్షాల నేతలతోపాటు ప్రత్యేక విమానంలో కశ్మీర్‌కు బయలు దేరి వెళ్లారు. అయితే కశ్మీర్ ప్రభుత్వం వారిని అడ్డుకుని తిరిగి వెనక్కి పంపింది. ఇక అప్పటి నుండి కూడ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు రాహుల్ గాంధీ, ఈనేపథ్యంలోనే కోర్టుకు సైతం వెళ్లిన పరిస్థతి నెలకొంది. కొద్ది రోజుల్లోనే కశ్మీర్‌పై కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో పలువురు నేతలు ప్రశంషిస్తున్నారు.

English summary
n a clear message that the country was united in its stand on Kashmir, Opposition leader Rahul Gandhi on Wednesday said that there is no scope for any foreign country to interfere in it and called Pakistan the ‘prime supporter of terror’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X