వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ను ఒంటరి చేస్తున్న మోడీ, ఆ దేశాలు కూడా షాకిచ్చాయి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/కరాచీ: యూరి ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్‌కు సంబంధముందని భావిస్తున్న భారత్.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. నవంబర్ నెలలో ఇస్లామాబాద్‌లో జరగబోయే సార్క్ 19వ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కాకూడదని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు.

సార్క్‌కు మోడీ నో

సార్క్‌కు మోడీ నో

మంగళవారం రాత్రి ఈ మేరకు అధికారిక నిర్ణయం వెలువడింది. శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు అనుకూల వాతావరణం లేకుండా పాకిస్తాన్ చేసిందని, సరిహద్దు అవతలి నుంచి ఎగదోస్తున్న ఉగ్రవాదం, ఒక సభ్యదేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోవడం దీనికి కారణమని ఆ ప్రకటనలో తెలిపారు.

అధికారిక నిర్ణయం

అధికారిక నిర్ణయం


ఈ పరిస్థితుల్లో భారత్‌ ఇస్లామాబాద్‌ సదస్సులో పాల్గొనలేకపోతుందన్నారు. ప్రస్తుతం సార్క్‌కు నేతృత్వం వహిస్తున్న నేపాల్‌కు ఈ విషయాన్ని తెలియజేశామని విదేశాంగ శాఖ ప్రకటనలో వెల్లడించింది. కాగా, సార్క్‌ నిబంధనల ప్రకారం సభ్య దేశాల్లో ఒక దేశాధినేత హాజరుకాకపోయినా సదస్సును నిర్వహించడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో ఇస్లామాబాద్‌ సదస్సు రద్దుకావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై, భారత్‌ తీసుకున్న నిర్ణయం విచారకరమని పాకిస్తాన్ వ్యాఖ్యానించింది.

ఆ మూడు దేశాలూ షాక్

ఆ మూడు దేశాలూ షాక్

భారత్ బాటలోనే మరికొన్ని దేశాలు కూడా సదస్సుకు విముఖత వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్థాన్, భూటాన్‌ దేశాలు కూడా సార్క్‌ సమావేశాలకు హాజరుకావద్దని నిర్ణయించుకున్నాయి. ఒక సభ్యదేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకుంటోందని అందుకే తాము సార్క్‌కు హాజరు కాలేమని బంగ్లాదేశ్‌ భావిస్తోంది.

నేపాల్‌కు సమాచారం

నేపాల్‌కు సమాచారం

ఈ మేరకు సార్క్‌కు నేతృత్వం వహిస్తున్న నేపాల్‌కు బంగ్లాదేశ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించిందని సమాచారం. మరోవైపు ఇదే కారణంతో ఆఫ్గాన్‌, భూటాన్‌లు కూడా సార్క్‌కు రావడం లేదని చెప్పిందని తెలుస్తోంది. దీంతో సార్క్‌ సదస్సులో పాక్‌ ఒంటరిగా మిగిలిపోనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
After India said Prime Minister Narendra Modi will not travel to Islamabad for the regional SAARC summit in November, three other members - Bangladesh, Afghanistan and Bhutan - have also pulled out of the meet, isolating host Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X