బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో బెంగళూరు, ఉలిక్కిపడిన ప్రజలు: దసరా ఉత్సవాలు టార్టెట్ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: దసరా ఉత్సవాల సందర్బంగా బెంగళూరు నగరంతో సహ దేశంలోని ప్రముఖ దేవాలయాలు, రైల్వేస్టేషన్లు లక్షంగా చేసుకుని దాడులు చేస్తామని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. బెంగళూరు నగరంతో సహ, మైసూరుతో పాటు వివిద నగరాల్లో ఇప్పటి నుంచి పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఘరానా మోసం, పాస్ పోర్టు, వీసా, ఎస్కేప్ !విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఘరానా మోసం, పాస్ పోర్టు, వీసా, ఎస్కేప్ !

దేశంలోని దేవాలయాలు, రైల్వేస్టేషన్లే మా లక్షం అని పాకిస్థాన్ కు చెందిన జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించిందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు దాడులు చేసే జాబితాలో బెంగళూరు నగరం ఉండటంతో కన్నడిగులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రవాసాంధ్రులు ఉలిక్కిపడ్డారు.

Pakistan Jaish-e-Mohammad terror outfit threatens attack in 6 states on Dasara India

ఆరు రాష్ట్రాల్లో 11 ప్రాంతాల్లో తాము దాడులు చేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించారు. జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు భారత్ ను హెచ్చరించి విడుదల చేసిన లేఖ భారత నిఘా వర్గాల అధికారుల చేతికి చిక్కింది. ఉగ్రవాదులు ఏ రాష్ట్రాల్లో దాడులు చేస్తాము అని వివరాలు ఆ లేఖలో వివరించారు.

ఫిబ్రవరిలో యడియూరప్ప రాజీనామా ?: సీఎంగా మరో లీడర్, శోభాకు సీఎం కొడుకులు చెక్ !ఫిబ్రవరిలో యడియూరప్ప రాజీనామా ?: సీఎంగా మరో లీడర్, శోభాకు సీఎం కొడుకులు చెక్ !

ముంబై, బెంగళూరు, చెన్నై, జైపూర్, భోపాల్, కోటా, రోహ్టక్, రెవారి, హిసార్, ఇటాసీ రైల్వేస్టేషన్లు రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాల్లోని దేవాలయాలు ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నాయని భారత్ నిఘా వర్గాలు హెచ్చరించాయి.

భారత్ నిఘా వర్గాల హెచ్చరికతో బెంగళూరు నగరంతో పాటు ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్న అన్ని దేవాలయాలు, రైల్వేస్టేషన్ల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, మీకు పూర్తి భద్రత కల్పిస్తామని సంబంధిత నగరాల పోలీసులు ప్రజలకు హామీ ఇచ్చారు.

English summary
Pakistan Jaish-e-Mohammad terror outfit threatens attack in 6 states on Dasara India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X