వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ కుటిల యత్నం: హెచ్చరికలు లేకుండానే సట్లేజ్ నది గేట్ల ఎత్తివేత.. నీట మునిగిన పంజాబ్

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ అక్కసుతో భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రాంలో ఉన్న నదీపరివాహాక ఉన్న పలు ప్రాంతాలు వరదనీటీలో మునిగిపోయాయి. పాకిస్థాన్ ఎలాంటీ హెచ్చరికలు లేకుండానే సట్లేజ్ నదిపై ఉన్న గేట్లను ఎత్తివేసింది. దీంతో సట్లేజ్ నదీ పరివాహాక ప్రాంతంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగాయి. ఎలాంటీ ముందస్తు హెచ్చరికలు లేకుండా నీరు ఉప్పోంగడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దీంతో అప్రమత్తమైన పంజాబ్ ప్రభుత్వం హుటాహుటిన సహాయక చర్యలను చేపట్టింది.

పాకిస్థాన్‌లో కురుస్తున్న వర్షాలకు రెండు దేశాల మధ్య ప్రవహించే సట్లేజ్ పోంగిపోర్లుతోంది. దీంతో ఎగువప్రాంతమైన పాకిస్థాన్ గేట్లు ఎత్తివేసింది. దీంతో పంజాబ్‌లోని ఫిరోజ్ జిల్లాలో తెండివాలా అనే గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది. వరదలతో గ్రామం కరకట్ట దెబ్బతింది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు అప్రత్తమయ్యారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించిన ప్రభుత్వం వెంటనే సహయక చర్యలను చేపట్టింది.

Pakistan lifted its gates of the Sutlej River without any warning.

పంజాబ్ ప్రభుత్వంతోపాటు జాతీయ విపత్తు నివారణ సంస్థలను కూడ రంగంలోకి దింపింది. వరద ప్రాంతాల్లో సహాయాక చర్యలతోపాటు వైద్యశిబిరాలను సైతం ఏర్పాటు చేసింది. నేరుగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆదేశాలతో అధికారులు హూటాహుటిన సహయాక చర్యలు చేపట్టారు. కాగా తెండీవాల కరకట్టను పునరుద్దరణ పనులు సైతం చేపట్టారు. కాగా కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుండి పాకిస్థాన్ ఎక్కడ అవకాశం లభిస్తుందా అని వేచి చూస్తోంది. కయ్యానికి కాలు దువ్వేందుకు పీవోకేలో కాల్పుల విరమణకు కూడ తెగపడుతున్న విషయం తెలిసిందే...

English summary
A few villages in Punjab's border district Ferozepur are facing a flood threat after a major portion of an embankment in the catchment area of the Sutlej river was washed away following the Pakistan's release of water into the Indian territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X