• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనవేళ్లు మన కంట్లోనే...! రాహుల్ గాంధీయో కాదు బీజేపీ నేతల పేర్లను ఇరికించిన పాకిస్థాన్

|

కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు గాను ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు బీజేపి నేత హర్యణ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖతార్‌ను కూడ ఇరికించింది. కశ్మీర్ పరిస్థితిపై ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలను పేర్కోంటూ పాకిస్థాన్ లేఖను రాసింది. దీంతో నిన్నటి వరకు రాహుల్ గాంధీని విమర్శించిన బీజేపీ నేతల నోట్లో వెలక్కాయ పడింది.

యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!!యూఎస్ జనరల్ అసెంబ్లీలో 27న మోడీ ప్రసంగం..!! తర్వాత ఇమ్రాన్ ఖాన్ కూడా..!!!

 కశ్మీర్‌ పరిస్థితులను పరీశీంచండి అంటూ పాక్ లేఖ

కశ్మీర్‌ పరిస్థితులను పరీశీంచండి అంటూ పాక్ లేఖ

జమ్ము కశ్మీర్‌ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలనే కుట్రలను పాకిస్థాన్ తెరలేపుతోంది. ఈనేపథ్యలంనే తనకు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న పాకిస్థాన్, కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో అత్యవసరంగా సమావేశం అయిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎటు తేల్చకుండా వదిలిపెట్టింది. అయితే పాకిస్థాన్ కశ్మీర్ లొ నెలకొన్న పరిస్థితులను పరీశించాల్సిందిగా ఐరాసకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

 యూఎన్ఓకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ పేరు

యూఎన్ఓకు రాసిన లేఖలో రాహుల్ గాంధీ పేరు

ఈ లేఖ విషయంలో పాకిస్థాన్ చాల తెలివిగా వ్యవహరించింది. తాను స్వంతగా భారత్‌పై ఆరోపణలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను లేఖలో పొందుపర్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కశ్మీర్‌లో మానవ హక్కులు ఉల్లంఘనలు జరుగుతున్నాయని చేసిన ఆరోపణలను పాకస్థాన్ తన లేఖలో పేర్కోంది. దీంతో రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ వ్యవహారం వల్లే పాకిస్థాన్ రెచ్చిపోయిందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఇన్నాళ్లు గుడ్డిగా భారత నిర్ణయాన్ని వ్యతిరేకించారని దుయ్యబట్టారు. దీంతో రాహుల్ గాంధీ సైతం దిగివచ్చి పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ ఎప్పుడు భారత అంతర్భాగమని పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తుందని డ్యామేజ్ కట్రోల్ చేసుకున్నారు.

తాజాగా హర్యణా సీఎం మనోహర్ లాల్

తాజాగా హర్యణా సీఎం మనోహర్ లాల్

అయితే తాజా వివాదం బీజేపీకి చుట్టుకుంది. పాకస్థాన్ రాసిన లేఖలో బీజేపీ సినియర్ నేత హర్యాణ ముఖ్యమంత్రితో పాటు యూపీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ చేసిన వ్యాఖ్యలను లేఖలో పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే అయిన మనోహర్ లాల్ ఖట్టర్ కశ్మీర్‌ అమ్మాయిలను స్వేచ్చగా పెళ్లి చేసుకోవచ్చని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు కావడంతో కశ్మీర్ చెందిన అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తారని అన్నారు. తమ ప్రభుత్వంలోని కొంతమంది మంత్రులు బీహార్ అమ్మాయిలను కోడళ్లుగా తెచ్చుకుంటున్నారని, ఇప్పుడు ఆ అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీంతో పాకిస్థాన్ ఈ అంశాలను కోడ్ చేస్తూ...కశ్మీర్‌లో లింగ వివక్ష కొనసాగేందుకు అవకాశం ఉందని పేర్కోంది. దీంతో బీజేపీపై కాంగ్రెస్ నేతల విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇన్నాళ్లు ఇరు పార్టీలను అసరా చేసుకుని తన పంతాన్ని నెగ్గించుకునేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోంది.

English summary
Pakistan’s letter to the United Nations alleging human rights violations in Jammu and Kashmir, after its special status was revoked, mentions not only Congress leader Rahul Gandhi but also Haryana Chief Minister and BJP leader Manohar Lal Khattar
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X