వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ ఆర్మీపై నమ్మకం లేకనే అణు బాంబుల బెదిరింపు : బిపిన్ రావత్

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్ తమ స్వంత సైన్యంపై నమ్మకం లేదని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆర్టీకల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్ దళాలపై సామర్థ్యం లేకనే అణ్యాయుధాలంటూ ప్రచారం చేస్తోందని, దీంతో భారత్‌ను భారత్‌ను భయపెట్టాలని చూస్తోందని ఆయన అన్నారు. అయితే ఎక్కడైన ఉగ్రదాడి జరిగితే దానికి ప్రతికారం భారత్ తీర్చుకుంటుందని రావత్ హెచ్చరించారు.

పాకిస్థాన్ గత కొద్ది రోజులుగా యుద్దం అంటూ హెచ్చరికలు చేస్తున్న విషయం తెలిసిందే, అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మద్దతు లభించని నేపథ్యంలోనే పాకిస్థాన్ ఒంటరి అయింది. దీంతో భారత్‌తో యుద్దానికి దిగుతామంటూ భయానికి గురి చేస్తోంది. చేతిలో ఇమిడే అణ్యాయుధాలతో దాడి చేస్తామని పాకిస్థాన్ రైల్వే మంత్రి అన్నారు. ఈనేపథ్యంలోనే ఆర్మీ చీఫ్ రావత్ స్పందించారు. పాకిస్థాన్ నియంత్రణ రేఖ వెంట పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరిస్తుందని అన్నారు. అయితే పాకిస్థాన్ చేసే దాడిని తిప్పికొట్టేందుకు భారత్ సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికతో భారత ఆర్మీ అప్రమత్తంగా ఉందని ఆయన తెలిపారు.

Pakistan nuclear bogey shows lack of faith in its Army

మరోవైపు కశ్మీర్‌లో గత నెల రోజులుగా కొనసాగుతున్న భద్రత ఆంక్షలను ఒక్కోక్కటిగా తొలగిస్తున్నారు. సాధరణ పరిస్థితులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరించడతో పాటు ప్రభుత్వపరమైన కార్యాలయాలు, స్కూల్లు ప్రారంభమయ్యాయి. మొత్తం 90 శాతం మేర ఆంక్షలు తొలగించినట్టు కశ్మీర్ అధికారులు తెలిపారు.

English summary
The Pakistan nuclear bogey in retaliation to the withdrawal of Article 370 is a sign that there is a lack of conviction in its conventional forces, Army chief General Bipin Rawat told ET, adding it’s time to give peace a chance in Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X