వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత ఫొటోలతో దాడి చేసినట్టు ప్రకటన .. బహిర్గతమైన పాక్ పన్నాగం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వైమానిక దాడితో రగిలిపోతోన్న పాకిస్థాన్ .. తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. భారత సేనలు దాడిచేసి తమ సత్తాను చాటుకుంటుంటే .. ఏమీ చేయలేని పాకిస్థాన్ గతంలో జరిగిన ఘటనలను తెరపైకి తీసుకొచ్చి .. అస్థిత్వాన్ని చాటుకోవాలని చూస్తోంది.

మరోసారి బయటపడ్డ కుటిల బుద్ధి
బుధవారం ఉదయం రెండు జెట్ విమానాలను కూల్చివేసినట్టు కలరిచ్చింది పాకిస్థాన్. ఊరికే కూల్చివేశామని చెబితే సరిపోదని భావించి .. దానికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది. అయితే ఆ ఫోటోలు ఫేక్ అని భారత ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. గతంలో జరిగిన దాడులు .. పాకిస్థాన్ పోస్ట్ చేసిన ఫొటోలను చూపిస్తూ పాకిస్థాన్ కపటబుద్ధిని బయటపెట్టారు.

pakistan post fake photos

జోధ్ పూర్ .. బెంగళూరు ఘటనల ఫొటోలు షేర్ ..
బుధవారం ఉదయం కూల్చిన జెట్ విమానాల ఫొటోలు పోస్ట్ చేసి బీరాలు పలికింది పాకిస్థాన్. కానీ అవి ఫేక్ అని తేలడంతో మిన్నకుండిపోయింది. గతంలో జరిగిన జోధ్ పూర్ జెట్ విమాన ప్రమాదానికి సంబంధించి ఫోటో షేర్ చేసి పప్పులో కాలేసింది. దీంతోపాటు ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో ప్రమాదం జరిగింది. రెండు ప్లైట్లు కూలిపోవడంతో .. ఒక పైలట్ కూడా చనిపోయాడు. ఈ ఫోటోను కూడా వక్రబుద్ధి గల పాకిస్థాన్ షేర్ చేసి తన కుటిల రాజకీయం ఏంటో ప్రపంచానికి చాటింది..

English summary
today morning, two jets were shot dead by Pakistan. Thinking that it was not enough to tell you that it was not enough .. However, Indian officials say that the photos are Fake. Attacks in the past. Pakistani revealed the images of Pakistani posturing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X