వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ మరో కుట్ర : భారత కరెన్సీ పాకిస్థాన్ లో ప్రింటింగ్ హైదరాబాద్ లో చలామని !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పక్కనే బల్లెంలా ఉండే పాకిస్థాన్ .. మరిన్ని కుట్ర, కుయుక్తులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించిన ఆ దేశం తాజాగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టాలనుకుంటోంది. ఇందులో భాగంగా మన కరెన్సీ నోట్లను ముద్రించేందుకు ఏర్పాట్లు చేసినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.

నర్సాపురం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి! నర్సాపురం లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి!

నకిలీ నోట్ల ముద్రణ

నకిలీ నోట్ల ముద్రణ

గత నెలలో హైదరాబాద్‌లో దొరికిన నకిలీ కరెన్సీ నోట్లు పాకిస్థాన్‌లో ప్రింట్ చేసి, బంగ్లాదేశ్ మీదుగా బెంగాల్ వచ్చినట్టు నిఘావర్గాలు గుర్తించారు. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లో గల క్వెట్టాలో భారత్ పవర్ ప్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రింట్ అయ్యే నోట్లు ఒరిజినల్ వాటిలాగే ఉన్నాయి. అయితే అసలు నోట్లపై ఉండే భద్రతా ప్రమాణాలను కాపీ చేయలేకపోవడంతో .. నకిలీ నోట్లను గుర్తించడం తేలికవుతోంది.

పాక్ దారి అడ్డదారి ...

పాక్ దారి అడ్డదారి ...

నక్కజిత్తులు వేసే పాకిస్థాన్ .. నకిలీ కరెన్సీ సరఫరా కోసం కొత్త దారులు వెతుకుతోంది. సరిహద్దులో నిఘాను మరింత పటిష్టం చేయడంతో ఏం చేయాలని మదనపడుతోంది. ఇదివరకు దుబాయ్, సౌదీ అరేబియా పంపించి .. అక్కడినుంచి ఓడల ద్వారా గుజరాత్, మహారాష్ట్ర తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో క్వెట్టా నుంచి కరాచీకి పంపిస్తున్నారు. అటు నుంచి బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకొచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణి చేయిస్తోంది. కరాచీ నుంచి నకిలీ కరెన్సీ చలామనీ చేసేవారికి ఎక్కువమొత్తంలో కమీషన్ చెల్లిస్తోంది.

పెరిగిన ఏజెంట్ల కమీషన్ ..

పెరిగిన ఏజెంట్ల కమీషన్ ..

ఇటీవల హైదరాబాద్‌లో పట్టుబడ్డ నగదు కరెన్సీ రేటు 1:3గా ఉంది. ఒరిజనల్ నోట్లు 30 వేలు ఇస్తే ఏజెంట్ లక్ష నకిలీ కరెన్సీ ఇచ్చేవారు. కానీ ఈ కమీషన్ కూడా పెరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇందుకు కారణం నోట్లు పక్కగా ముద్రించడమేనని తెలుస్తోంది. ఇటీవల పాతబస్తీలో అరెస్టైన గౌస్‌ను విచారిస్తే కమీషన్ బండారం బయటపడింది. ఒరిజనల్ 50 వేలు ఇస్తే మాల్దాకు చెందిన బబ్లూ లక్ష రూపాయల నకిలీ నోట్లు ఇచ్చినట్లు తెలిసింది.

బాంబులు, నకిలీ కరెన్సీ దందా

బాంబులు, నకిలీ కరెన్సీ దందా

పాతబస్తీలో నకిలీ కరెన్సీ మారుస్తూ అరెస్టైన పండ్ల వ్యాపారి గౌస్ .. 1991లో బాంబులతో పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు టాడా కేసు నమోదు చేశారు. 2011 నుంచి గౌస్ నకిలీ కరెన్సీ దందా ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్ నుంచి పలు మార్గాల్లో నకిలీ కరెన్సీని హైదరాబాద్ తీసుకొచ్చి చెలామణి చేశాడు. మాల్దాలో ఉన్న కృష్ణాపూర్‌కు చెందిన అమీనుల్ రెహ్మాన్, ఎలియాస్ బబ్లూతో పరిచయం ఏర్పడింది. బబ్లూకు 40 వేలు ఒరిజనల్ నోట్లు ఇచ్చి .. లక్ష రూపాయల నకిలీ కరెన్సీని తీసుకొచ్చేవాడు. బబ్లూ, గౌస్‌తోపాటు పలువురికి నకిలీ కరెన్సీ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బబ్లూ కోసం గాలింపు ప్రక్రియను చేపట్టారు.

English summary
The counterfeit currency notes in Hyderabad were printed in Pakistan and identified by the intelligence agencies that they came to Bengal via Bangladesh. has a power press in Quetta, Balochistan, Pakistan. The notes to print here are like the original ones. But it is easy to detect fake notes so that it can not copy the security standards that are on the original banknotes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X