వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులకు తెగబడిన పాక్, ఎదురు కాల్పులు

|
Google Oneindia TeluguNews

జమ్మూ: పాకిస్థాన్ మళ్లి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైనికులను రెచ్చగొడుతూ కాల్పులకు పాల్పడింది. భారత సహనాన్ని పదేపదే పరిక్షిస్తున్న పాకిస్థాన్ కు భారత సైనికులు సరైన బుద్ది చెప్పడానికి సిద్దం అయ్యారు.

జమ్మూ కాశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని సౌజైన్ సెక్టర్ లో శుక్రవారం వేకువజామున పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే స్పందించాయి.

Pakistan Rangers resorted to unprovoked firing at BSF outposts in Jammu

పాక్ సైనికుల మీద ఎదురు కాల్పులు జరిపారు. గత మూడు రోజుల నుండి వరుసగా పాక్ భారత్ భద్రతా బలగాల మీద కాల్పులకు తెగబడుతున్నది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నది. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నది.

మూడు రోజుల క్రితం పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని ఉదమ్ పూర్ లో చోరబడ్డారు. ఒక ఉగ్రవాది అంతం కాగా నవెద్ మహమ్మద్ అనే ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు. నవెద్ పట్టుబడినప్పటి నుండి పాక్ వరుసగా భారత్ సైన్యం మీద కాల్పులు జరుపుతున్నది.

English summary
India and Pakistan traded heavy fire on the International Border in Jammu and Kashmir on friday after Pakistan Rangers resorted to unprovoked firing at BSF positions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X