వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో సైబర్ వార్: పాకిస్తాన్ హ్యాకర్స్ అసలు ఉద్దేశ్యం అదేనా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్ అనంతరం భారత్ - పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. సరిహద్దుల్లోను అలాగే ఉంది. అదే సమయంలో సైబర్ స్పేస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. సెప్టెంబర్ 29 సర్జికల్ స్ట్రయిక్ అనంతరం పాకిస్తాన్ హ్యాకర్స్.. భారత్ వెబ్‌సైట్ల పైన పడ్డారు.

పాక్‌కు ముచ్చెమటలు పోయిస్తున్న హ్యాకర్లు, 'తెలంగాణ సైబర్ వార్' దాడి

పాకిస్తాన్ హ్యాకర్స్ దాదాపు ఏడువేల భారత సైట్ల పైన పడ్డారు. అయితే వాటి పైన ఎలాంటి కంట్రోల్ లేదా ఎలాంటి డేటా సేకరించలేకపోయారని అంటున్నారు.

పాక్ హ్యాకర్స్‌కు ప్రతిగా భారత్ హ్యాకర్స్ దాదాపు వంద పాకిస్తాన్ వెబ్ సైట్ల పైన పడ్డారు. వాటిని హ్యాకర్స్ తమ ఆదీనంలోకి తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్ హ్యాకర్స్ తగ్గని పరిస్థితి ఏర్పడింది. తమ సైట్లను రిలీజ్ చేసేందుకు వారు భారత్ హ్యాకర్లతో మాట్లాడినా, డబ్బులిస్తామన్నా.. దేశమే మిన్న అని ఇండియన్ హ్యాకర్స్ తిప్పికొట్టారు.

Pakistan's cyber war more about propaganda than data theft

పాకిస్తాన్ హ్యాకర్స్ సైబర్ దాడిలో తమ సత్తా చూపించాలని భావించారు. వారు లోయర్ లెవల్స్ ప్రభుత్వ సైట్ల పన పడ్డారు. కొన్ని పోస్టులు పెట్టారు. తద్వారా సైబర్ వార్‌లో తాము భారత్‌ను కార్నర్ చేయగలమని అభిప్రాయపడ్డారని చెబుతున్నారు.

పాకిస్తాన్‌లో దాదాపు 3,000 మంది పూర్తి టైమ్ హ్యాకింగ్ కోసం పని చేస్తున్నారు. హానీ ట్రాప్ నుంచి వెబ్ సైట్లను డిఫేస్ చేసేందుకు వారంతా ఓ యూనిట్‌గా ఉన్నారు. అయితే సర్జికల్ స్ట్రయిక్ తర్వాత వారు మరింత సైబర్ దాడికి ప్రయత్నిస్తున్నారు.

ఈ సైబర్ దాడిలో భాగంగా వారు తొలుత ఓ ప్రచారం చేశారు. సర్జికల్ స్ట్రయిక్ దాడులు జరగలేదని నమ్మించే ప్రయత్నం చేశారు. అవి అవాస్తవమని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు, భారత సైన్యం వ్యక్తిగత వాట్సాప్ అప్లికేషన్‌ను హ్యాక్ చేసి సమాచారం దొంగిలించే ప్రయత్నం చేశారు. కానీ మెరుగైన భద్రత కారణంగా అది పారలేదు.

మన నుంచి ఎలాంటి సమాచార వెళ్లలేదని దీని పైన విచారణ జరిపిన అధికారులు జరుపుతున్నారు. కేవలం వెబ్‌సైట్స్‌ను డీఫేస్ మాత్రమే చేయగలిగారని, డాటాని తీసుకెళ్లలేదన్నారు. డీఫెస్ చేయడం ద్వారా సైబర్ వార్ జరుగుతోందని అవాస్తవాలను ప్రచారం చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు. మొత్తానికి డేటా దొంగిలించే కంటే ప్రచారమే పాకిస్తాన్ హ్యాకర్స్ లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు.

అదే సమయంలో ఇండియన్ హ్యాకర్స్ మాత్రం దాదాపు వంద పాకిస్తాన్ సైట్లను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. వాటిని రిలీజ్ చేసేందుకు భారత్ హ్యాకర్స్ అంగీకరించలేదని చెబుతున్నారు. ఒకవేళ రిలీజే చేసినా.. దాని ద్వారా వచ్చే మొత్తాన్ని చారిటీకి ఇస్తామని ఇండియన్ హ్యాకర్స్ చెబుతున్నారు.

English summary
There has been an escalation of tensions between India and Pakistan and the same can be witnessed on the cyberspace as well. In fact it was the hackers from Pakistan who launched a major offensive on Indian websites in the aftermath of the September 29 surgical strikes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X