వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై పాక్ భారీ కుట్ర! ఉగ్రవాదులతో ఐఎస్ఐ చీఫ్ భేటీ, జీవాయుధాలతో దాడికి ప్లాన్?

ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా పాకిస్తాన్ కు బుద్ధి మాత్రం రావడం లేదు. ఏదోరకంగా భారత్ ను దెబ్బతీయాలనే చూస్తోంది. అందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా భారత్ పై భారీ కుట్రకు తెరతీసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా పాకిస్తాన్ కు బుద్ధి మాత్రం రావడం లేదు. ఏదోరకంగా భారత్ ను దెబ్బతీయాలనే చూస్తోంది. అందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా భారత్ పై భారీ కుట్రకు తెరతీసింది.

చైనా బరితెగింపు! అమెరికాపై దాడికి రిహార్సల్స్? గువామ్ ద్వీపమే లక్ష్యం, రాజుకున్న అగ్గి..!చైనా బరితెగింపు! అమెరికాపై దాడికి రిహార్సల్స్? గువామ్ ద్వీపమే లక్ష్యం, రాజుకున్న అగ్గి..!

ట్రంపా.. మజాకా? ఆయన పర్యటన కూడా.. చిన్నసైజు యుద్ధమే! ఏ దేశమైనా తలవంచాల్సిందే..ట్రంపా.. మజాకా? ఆయన పర్యటన కూడా.. చిన్నసైజు యుద్ధమే! ఏ దేశమైనా తలవంచాల్సిందే..

ఉత్తరకొరియా కిమ్ రాజభోగాలు, ఇదీ ఆ దేశం సత్తా, అణుయుద్ధం వస్తే మాత్రం...ఉత్తరకొరియా కిమ్ రాజభోగాలు, ఇదీ ఆ దేశం సత్తా, అణుయుద్ధం వస్తే మాత్రం...

పాక్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఐఎస్ఐ కశ్మీర్లో అల్లర్లకు కారణం అవుతోందనే సంగతి తెలిసిందే. దశాబ్దాల తరబడి ఉగ్రవాదులకు శిక్షణనిస్తూ, నిధులను అందజేస్తూ.. ఆ సంస్థ జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపిస్తోంది.

సర్జికల్ స్ట్రయిక్స్ మరువని పాక్...

సర్జికల్ స్ట్రయిక్స్ మరువని పాక్...

ఆ మధ్య భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ ను పాకిస్తాన్ మరిచిపోలేకపోతోంది. అప్పట్నించి భారత్ ను ఏదోరకంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. మరోవైపు భారత్ కు అమెరికా స్నేహ హస్తం అందించడం, తనపై మరింత నిఘా పెట్టడాన్ని కూడా అది సహించలేకపోతోంది. భారత్ విషయంలో.. ప్రతీకారమే లక్ష్యంగా పరుగులు పెడుతోంది. ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. ఎలాగైనా సరే.. భారత్ ను అస్థిరపరచడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది.

ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఐఎస్ఐ...

ఉగ్రవాదులతో చేతులు కలిపిన ఐఎస్ఐ...

కశ్మీర్ లో అల్లర్ల వెనుక పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందనే విషయాన్ని భారత్ ఎప్పటి నుంచో చెబుతోంది. తాజాగా దీనికి సంబంధించి బలమైన ఆధారాలు లభించాయి. ఐఎస్ఐ చీఫ్ నవీద్ ముఖ్తార్ ఉగ్రవాదులతో సమావేశమై బయోలాజికల్ వార్ ఫేర్ (జీవాయుధాలతో యుద్ధం) గురించి చర్చించిన విషయం వెలుగు చూసింది. అక్టోబర్ 9న పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బాఘ్ జిల్లాలో ఉన్న చకోటి ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులతో లెఫ్టినెంట్ జనరల్ నవీద్ భేటీ అయ్యారు. ఉగ్రవాదులతో ఐఎస్ఐ చేతులు కలిపిందనడానికి ఇదే పెద్ద నిదర్శనం.

ఉగ్రవాదులకు భారీగా నిధులు...

ఉగ్రవాదులకు భారీగా నిధులు...

ఈ సమావేశంలో ఐఎస్ఐ చీఫ్‌తోపాటు ఆ సంస్థకు చెందిన బ్రిగేడియర్ హఫీజ్ అహ్మద్, లెఫ్టినెంట్ కల్నల్ జావెద్ అహ్మద్, మేజర్ జఫర్ అలీ కూడా పాల్గొన్నారు. పాకిస్తాన్ ఆర్మీ నుంచి కెప్టెన్ మన్సూర్ అలీ ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా ఐఎస్ఐ చీఫ్ నవీద్ ముఖ్తార్ రెండు అంశాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఒకటి- ఉగ్రవాదులకు భారీగా నిధులు ఇవ్వాలని, రెండు- శీతాకాలం వచ్చేలోగా ఉగ్రమూకను జమ్మూ కశ్మీర్‌లోకి చొరబడేలా చేసి మరిన్ని సమస్యలు సృష్టించాలని ఆయన సూచించినట్లు సమాచారం.

జీవాయుధాల యుద్ధంలో చైనా వద్ద శిక్షణ!

జీవాయుధాల యుద్ధంలో చైనా వద్ద శిక్షణ!

జీవాయుధాల యుద్ధంలో చైనా దగ్గర శిక్షణ పొందిన సైనికాధికారుల్ని నియంత్రణ రేఖ వెంబడి నియమించాలని కూడా ఆ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. మేజర్, కెప్టెన్ స్థాయిలోని 20 మంది సైనికాధికారులు జీవాయుధాల యుద్ధంలో తర్ఫీదు పొందడం కోసం ఇప్పటికే చైనా వెళ్లినట్లు సమాచారం. అక్కడ శిక్షణ పూర్తయ్యాక వారు పాక్ ఆక్రమిత కశ్మీర్లో పని చేస్తూ.. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తారని సమాచారం. పాకిస్తాన్ ఏం జరగబోతుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. భారత్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.

English summary
When Lieutenant General Naveed Mukhtar, director-general of the Inter-Services Intelligence (ISI), attended a meeting with terrorists earlier this month, biological warfare was also on the agenda.The involvement of the ISI, the Pakistani military intelligence agency, in the troubles in Kashmir is well known. It has been instrumental in creating trouble in J&K for decades by training, funding and arming terrorists before sending them across the border. Now, comes more evidence of the ISI's involvement with terror and the threat of biological attacks by Pakistan army-aided terrorists. The latest intelligence reports say that on October 9, at Chakoti, District Bagh, in Pakistan-occupied Kashmir, Lieutenant General Naveed attended a meeting with terrorists of the Hizb-ul-Mujahideen and the Jaish-e-Mohammed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X