వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో పన్నాగానికి పాక్ కుట్ర .. కశ్మీర్ జవాన్ల సరుకుల్లో విషం కలిపే కుట్ర ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో మరో పన్నాగానికి పాకిస్థాన్ పాల్పడే అవకాశం ఉందని భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. పాక్ చెరలో ఉన్న అభినందన్ ను విడిపించేందకు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకురావడం .. పాక్ ను ఏకాకి చేయడంతో ఆ దేశం అంతర్గతంగా రగులుతున్నట్టు అర్థమవుతోంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ లో విధులు నిర్వర్తించే జవాన్ల నిత్యావసర సరుకుల్లో విష ప్రయోగం చేయాలని ప్రణాళిక రచించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పన్నాగాన్ని పాకిస్థాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐ పాటుపడే అవకాశం ఉందని .. సరుకులు పంపిణీ చేసే సమయంలో ఒకటికి, రెండుసార్లు చూసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేసింది.

రేషన్ క్యాంపుల వద్ద భద్రత
అభినందన్ విడుదల .. వాయుసేన దాడులతో రగిలిపోతోన్న పాకిస్థాన్ .. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతోపాటు ప్రతీకారంగా కశ్మర్ లోయలో జవాన్లకు సరఫరా చేసే నిత్యావసర వస్తువుల్లో విష ప్రయోగం చేసి దెబ్బకొట్టే అవకాశం ఉందని నిఘావర్గాల సమాచారం. దీంతో ముందుజాగ్రత్తగా చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్ లో నిత్యావసర సరుకులు పంపిణీ చేసే క్యాంపుల వద్ద భారీగా భద్రతాసిబ్బందిని మొహరించింది.

Pakistans ISI planning to poison ration stocks of Indian Army jawans

దేశంలోని ఇతరప్రాంతాల్లో కూడా
ఒక కశ్మీర్ పై ఫోకస్ చేస్తే మూకలు .. ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్నిప్రాంతాల్లో జవాన్లకు అందజేసే రేషన్ క్యాంపుల వద్ద అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది. సరుకులను ఎప్పటికప్పుడు చెక్ చేయడం వల్ల ఉగ్ర మూకల చర్యలను వేగంగా తిప్పికొట్టొచ్చని ఐబీ వర్గాలు సూచించాయి.

English summary
pakistan Military intelligence (MI) and ISI may be planning to carry out another conspiracy against Indian Army jawans, according to intelligence sources. Chatter floated by a Pakistani number claims that the Pakistani MI and ISI agents operating in Kashmir are planning to "mix poison" in ration stocks of security forces deployed in the Valley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X