వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావూద్ ఇండియాకు రాకుండా పాక్ ఐఎస్ఐ అడ్డగింత: కాస్కర్

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ తిరిగివచ్చే అవకాశం లేదని అతడి సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కాస్కర్ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ తిరిగివచ్చే అవకాశం లేదని అతడి సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కాస్కర్ చెప్పారు.

దావూద్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్న కాస్కర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. . ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న కాస్కర్ దావూద్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

Pakistan's ISI won't allow Dawood Ibrahim to return to India: Iqbal Kaskar

1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఒక వేళ భారత్ తిరిగి రావాలనుకున్నా.. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అతడిని రానివ్వదని కాస్కర్ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. దావూద్ భారత్‌కు తిరిగివస్తే పాకిస్తాన్‌ కీలక రహస్యాలు తెలిసిపోతాయని ఐఎస్ఐ భావించడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

అదే జరిగితే పాకిస్తాన్‌కి మరిన్ని తలనొప్పులు తప్పవని అక్కడి అధికారులు భయపడుతున్నట్టు సమాచారం.
కొన్నేళ్ల క్రితం దావూద్ ఇబ్రహీం స్వదేశానికి తిరిగి వచ్చేయాలని కోరుకొన్నాడని ఆయన సోదరుడు కాస్కర్ పోలీసులకు చెప్పారు.

. దావూద్ తనను లండన్‌లో కలుసుకున్నాడనీ... భారత్‌కు వచ్చేయాలని భావిస్తున్నాడని సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ 2015లో ప్రకటించారు కూడా. భారత్ వచ్చిన తర్వాత హౌస్ అరెస్ట్‌లో ఉండి విచారణకు సహకరించాలని దావూద్ అనుకున్నాడనీ... అయితే ఇక ఎప్పటికీ జైల్లోనే మగ్గాల్సి వస్తుందని అతడు భయపడినట్టు జెఠ్మలానీ అప్పట్లో పేర్కొన్నారు. 1993 ముంబై పేలుళ్లలో తన హస్తం లేదనీ.. అయితే పోలీసులు దర్యాప్తు సందర్భంగా తనను థర్డ్ డిగ్రీతో వేధించబోమని హామీ ఇస్తేనే భారత్ వస్తానని చెప్పాడన్నారు.

English summary
Under interrogation in police custody, Iqbal Ibrahim Kaskar, has reportedly stated that US-designated terrorist and underworld don Dawood Ibrahim has no plans to return to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X