వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇమ్రాన్‌తో చర్చలకు మోడీ లేఖ: పాకిస్తాన్, లేఖ రాశారు కానీ.. భారత్ ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్‌కు అభినందనలు తెలిపారు. మనం మంచి స్నేహితులమని పేర్కొన్నారు. ఈ మేరకు ఇస్లామాబాద్ ఓ ప్రకటన చేసింది.

ఇమ్రాన్‌కు భారత ప్రధాని లేఖ రాశారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ తెలిపారు. ఇమ్రాన్‌ను చర్చలకు ఆహ్వానిస్తూ లేఖ రాశారని తెలిపారు. పాకిస్తాన్ ప్రముఖ పత్రిక డాన్ ప్రకారం.. మంత్రి ఖురేషీ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pakistan says PM Modi sought dialogue in letter to Imran Khan: India refutes claim

భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న అంశాలపై చర్చలకు ఆహ్వానిస్తూ మోడీ.. ఇమ్రాన్‌కు లేఖ రాశారు. అయితే దీనిని భారత అధికారులు కొట్టి పారేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారని, కానీ పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారని చెప్పారు. కానీ చర్చల ప్రస్తావన లేదన్నారు.

ఇదిలా ఉండగా, అదే ప్రెస్ మీట్లో పాకిస్తాన్ మంత్రి మాట్లాడుతూ.. కాశ్మీర్ సమస్య ప్రాధాన్యతను భారత్ గుర్తించాలన్నారు. మేం భారత్‌కు ఒకటి చెప్పాలనుకుంటున్నామని, ఇక్కడ సాహసాలకు స్థానం లేదని, మేం భారత్‌కు పొరుగు దేశం మాత్రమే కాదని, అటామిక్ పవర్ కలిగి ఉన్నవారిమని చెప్పారు.

English summary
In his first press conference as Pakistan's foreign minister, Shah Mehmood Qureshi said that Indian Prime Minister Narendra Modi has written a letter to Imran Khan inviting him for talks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X