వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో భారత రాయబారి ఫోన్ సీజ్, పాకిస్తాన్‌పై అమెరికా ఆగ్రహం

పాకిస్తాన్‌లోని భారత రాయబారి ఫోన్‌ను దాయాది సీజ్ చేసింది. ఓ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన అతని నుంచి.. కోర్టు ఆదేశాల మేరకు పాకిస్తాన్ హైకమిషన్ స్టాఫ్ ఫోన్ స్వాధీనం చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

కరాచీ: పాకిస్తాన్‌లోని భారత రాయబారి ఫోన్‌ను దాయాది సీజ్ చేసింది. ఓ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన అతని నుంచి.. కోర్టు ఆదేశాల మేరకు పాకిస్తాన్ హైకమిషన్ స్టాఫ్ ఫోన్ స్వాధీనం చేసుకుంది.

పాక్‌కు అమెరికా హెచ్చరిక

పాక్‌కు అమెరికా హెచ్చరిక

కాగా, అంతకుముందు భారత్‌, పాక్‌ మధ్య సంబంధాలు బెడిసికొట్టడానికి పాకిస్థానే కారణమని అమెరికా మండిపడింది. పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారత్‌లో దాడులు చేస్తూనే ఉన్నాయని, ఇలాగే కొనసాగితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

గత ఏడాది కాలంగా రెండు దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలే ఈ పరిస్థితికి దారితీశాయని తెలిపింది.

అవే సంబంధాలను దెబ్బతీశాయి

అవే సంబంధాలను దెబ్బతీశాయి

భారత్‌లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు పాకిస్తాన్ మద్దతివ్వకపోవడం, గతేడాది జనవరిలో జరిగిన పఠాన్‌కోట్‌ దాడిలో పాక్‌ విచారణ చేయకపోవడం వంటి కారణాలు 2016లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను చాలా వరకు దెబ్బతీశాయని అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ డేనియల్‌ కోట్స్‌ అన్నారు.

సంబంధాలు మరింత దిగజారుతాయి

సంబంధాలు మరింత దిగజారుతాయి

దీంతో పాటు గతేడాది భారత్‌లో జరిగిన రెండు ప్రధాన ఉగ్రదాడులు కూడా ప్రభావం చూపాయన్నారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు మరోసారి భారత్‌లో భీకర ఉగ్రదాడికి పాల్పడితే గనుక 2017లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారతాయని పాకిస్తాన్‌ను హెచ్చరించింది.

చర్చించుకోవాలి

చర్చించుకోవాలి

ఈ అంశాలపై భారత్‌, పాక్‌లు చర్చించుకోవాల్సిన అవసరముందని కోట్స్‌ అభిప్రాయపడ్డారు. గతేడాది జనవరిలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఏడుగురు భద్రతాసిబ్బంది అమరులయ్యారు.

English summary
In a provocative act, the Pakistani judicial authorities on Friday seized the mobile phone of the First Secretary of Indian diplomat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X