వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాలు, మందుగుండు.. సరిహద్దు రాష్ట్రాల్లో స్మగ్లింగ్, ఎలా తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కుక్క తోక వంకర అన్నట్టు దాయాది పాకిస్థాన్ బుద్ది మాత్రం మారదు. కశ్మీర్ విభజనతో అక్కసుతో ఉన్న పాకిస్తాన్, సమయం దొరికితే చాలు విరుచుకుపడాలని చూస్తోంది. జమ్ముకశ్మీర్ విలీన పక్రియ పూర్తయ్యాక భారత్‌లోని ఆయుధాలు, మందుగుండు పంపించే కుట్రపన్నింది. దాని కూడా సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లోని గ్రామాలకు డ్రోన్ల ద్వారా పంపించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు తెలిపారు.

 'పెరుగుతున్న అణ్వాయుధాలు, రాడికలైజేషన్: పాకిస్థాన్ చాలా ప్రమాదకరమైన దేశం!’ 'పెరుగుతున్న అణ్వాయుధాలు, రాడికలైజేషన్: పాకిస్థాన్ చాలా ప్రమాదకరమైన దేశం!’

కశ్మీర్ విభజన ప్రక్రియ ఆగస్టు 5న పూర్తయ్యింది. ఇక అప్పటినుంచి పాకిస్థాన్ అక్కసుతో ఉంది. గతనెల 22న ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్‌కు చెందిన ఉగ్రవాదులు పంపిన ఆయుధాలు, మందుగుండును ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేజడ్ఎఫ్‌కు అండగా నిలుస్తోంది పాకిస్థాన్ అని అధికారులు తెలిపారు. ఇదివరకు పంజాబ్, సరిహద్దు రాష్ట్రాలపై కేజడ్ఎఫ్ కుట్రపన్నిన సంగతి తెలిసిందే.

pakistan smuggling arms to india via drones !!

పాకిస్థాన్-ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో ఆయుధాలను డ్రోన్ల ద్వారా పంపించినట్టు పంజాబ్ డీజీపీ దినకర్ గుప్తా పేర్కొన్నారు. కేజడ్‌ఎఫ్‌కు ఐఎస్ఐ, జిహాదీ గ్రూపులు మద్దతు ఇస్తున్నాయని ఆయన తెలిపారు. డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మందుగుండు లభించడంపై పంజాబ్ సర్కార్ ధీటుగా స్పందించింది. ఈ విషయాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు. పంజాబ్‌లో లభించిన మందుగుండు, ఆయుధాల ఘటనపై విచారణ చేయాలని కోరారు.

English summary
The National Investigation Agency (NIA) will carry out an investigation into cases of drones being used by Pakistan to smuggle arms into India through bordering areas of Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X