వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ఉల్లంఘన: 12 ఔట్ పోస్ట్‌లే లక్ష్యం, కాల్పులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్ధాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని అఖ్నూర్‌ సెక్టార్‌ వద్ద పహారాలో ఉన్న భద్రత బలగాలు లక్ష్యంగా పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. పాక్‌ సైన్యం కాల్పులను భారత జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు.

మంగళవారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు రేఖ వెంబడి బీఎస్ఎఫ్ కు చెందిన 12 ఔట్ పోస్టులు లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని పోలీసులు వెల్లడించారు.

Pakistan violates ceasefire again, targets several Jammu and Kashmir forward posts

వెంటనే భారత బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగాయని చెప్పారు. దీంతో ఇరువైపులా హోరాహోరి కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు.

మంగళవారం ఉదయం 6.05 గంటలకు పాక్ బలగాలు బీఎస్ఎప్ పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయని వివరించారు. ఈ కాల్పుల్లో భారత్ వైపు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు.

English summary
Pakistan violates ceasefire again, targets several Jammu and Kashmir forward posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X