వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

#GOBACKMODI వెనుక దాగివున్న భారీ కుట్ర ఇదే!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన నేపథ్యంలో #GOBACKMODI అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇది తమిళులు చేయడం వల్లే ట్రెండింగ్‌లోకి దీనికి వెనుక భారీ కుట్రే దాగివుంది. ఈ కుట్ర వెనుక పాకిస్థాన్ ప్రధాన హస్తం ఉండటం గమనార్హం.

Recommended Video

#GoBackModi : Ahed Of Modi-Xi Visit, #GoBackModi Trending On Twitter || #మోడీగోబ్యాక్ || Oneindia

మోడీ లుక్ అదుర్స్: సంప్రదాయ తమిళ వస్త్రధారణలో కనిపించిన ప్రధానిమోడీ లుక్ అదుర్స్: సంప్రదాయ తమిళ వస్త్రధారణలో కనిపించిన ప్రధాని

ప్రతిసారీ ఇలానే..

సాధారణంగా నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనకు వెళ్లిన సమయంలో #GOBACKMODI అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. మోడీ తమిళనాడుకు వెళ్లిన దాదాపు ప్రతిసారీ ఇలాగే జరుగుతుండటం గమనార్హం.

తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటను కొందరు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. వారి వల్లే ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చే అవకాశం మాత్రం లేదు.

దాయాది కుట్ర బట్టబయలు

అయితే, ఇలా జరుగుతోందని లోతుగా గమనిస్తే మాత్రం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదంతా దాయాది దేశం పాకిస్థాన్ కుట్రలని తేలిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్థాన్‌కు మింగుడు పడటం లేదు. దీంతోనే ఆయనకు వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలు చేస్తోంది.

పాక్ అక్కసు ఇలా..

పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా ఇలా #GOBACKMODI హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ప్రధాని మోడీ ఎప్పుడు తమిళనాడు వెళ్లినా.. ఇలా పాకిస్థాన్‌కు చెందినవారు వివిధ పేర్లతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్‌తో #GOBACKMODI ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో పాక్ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రపంచ దేశాల మద్దతు కూలగొట్టడంలో విఫలమైన పాకిస్థాన్.. ఇలా భారత్‌పై అక్కసును వెల్లగక్కుతోంది.

మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు..

మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు..

శుక్రవారం(అక్టోబర్ 11న) చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఆయన మహాబలిపురం ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని మోడీ ఆలయ విశేషాలను జిన్‌పింగ్‌కు వివరించారు. ఇరుదేశాలకు సంబంధించిన ఇతర కీలక విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. చైనా, భారత్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకే ఈ భేటీ జరుగుతుండటం గమనార్హం. ఈ భేటీలో ఎలాంటి ఒప్పందాలు జరగవని ప్రభుత్వ వర్గాలు తేల్చాయి.

English summary
Pak's nefarious designs exposed, elements from across the border make#GOBACKMODI trend on twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X