వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాంకరమ్మ అజ్ఞానం : అది పండు కాదు తల్లి.. యాపిల్ కంపెనీ... (వీడియో)

|
Google Oneindia TeluguNews

అది పాకిస్థాన్‌‌కు చెందిన ఓ న్యూస్ ఛానెల్. దేశ బడ్జెట్‌పై డిబేట్ జరుగుతోంది. సీరియస్‌గా సాగుతున్న చర్చలో యాంకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయ పరిజ్ఞానం లేకపోవడంతో అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న ఆ యాంకరమ్మను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందటే..

పాకిస్థాన్ బడ్జెట్‌పై ఓ న్యూస్ ఛానెల్ చర్చ పెట్టింది. డిబేట్‌లో పాల్గొన్న ఆర్థిక రంగ నిపుణుడు దేశ ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ ఉదాహరణ చెప్తూ పాకిస్థాన్ వార్షిక బడ్జెట్ కన్నా యాపిల్ బిజినెస్ వాల్యూ ఎక్కువని అన్నారు. ఇంతలో కలగజేసుకున్న యాంకర్ తన నాలెడ్జ్ బయటపెట్టుకుంది. అవును నేను కూడా విన్నాను. భారీ సంఖ్యలో యాపిల్ వెరైటీలు ఉండటంతో ఆ వ్యాపారమే బాగుందంటూ బడ్జెట్‌పై తనకున్న తెలివిని బయటపెట్టింది. దీంతో షాక్ తిన్న సదరు ప్యానలిస్ట్ కాసేపటికి తేరుకుని తాను మాట్లాడుతున్నది యాపిల్ పండు గురించి కాదు.. యాపిల్ కంపెనీ గురించి అని అనడంతో బిత్తరపోయిన ఆ యాంకర్ ఎలాగోలా టాపిక్ డైవర్ట్ చేసింది.

Pakistani Anchor Confuses Apple Inc. With Fruit, Video Goes Viral

యాంకర్ తెలివికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకేముందు నెటిజన్లు ఆమెతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా జోకులు, సటైర్లు వేస్తూ యాంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. మేడంగారు ఏదో కలగంటూ సడన్‌గా నిద్ర లేచినట్టున్నారని ఒకరంటే, పాపం లంచ్ టైంలో ప్రోగ్రాం ఉండటంతో ఆకలితో యాపిల్ యాపిల్ అని అరిచిందని మరికొందరు కామెంట్ చేశారు. ఇంకొందరు మాత్రం పాపం ఆమెను వెనకేసుకొస్తున్నారు.

English summary
Twitter users around the globe exploded to a gaffe by a Pakistani female news anchor, who during a live chat programme, confused Apple Inc. with the fruit, prompting the guest on the show to correct her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X