బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాకిస్థాన్ దంపతులను బెంగళూరు నుంచి బహిష్కరించిన హైకోర్టు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అక్రమంగా బెంగళూరులో తల దాచుకున్న పాకిస్థాన్ దంపతులను నగరం నుంచి బహిష్కరించాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక హై కోర్టు ఆదేశాల మేరకు కుమారస్వామి లేఔట్ లో ఇంత కాలం నివాసం ఉన్న పాకిస్థాన్ దంపతులను నగరం నుంచి బహిష్కరించారు.

కిరణ్ గులామ్ ఆలీ, ఖాసీమ్ శంశుద్దీన్ దంపతులను బహిష్కరించారు. బెంగళూరు నుంచి పాకిస్థాన్ దంపతులను ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ నుంచి పాకిస్థాన్ దంపతులను వాఘా సరిహద్దు నుంచి వారి దేశానికి పంపించడానికి చర్యలు తీసుకుంటున్నారని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Pakistani couple Kasif Shamsuddin and his wife Kiran Gulam Ali will hand over to Pakistan

అక్రమంగా బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉన్న కిరణ్ గులామ్ ఆలీ, ఖాసీఫ్ శంశుద్దీన్ దంపతులను 10 రోజుల్లోపు నగరం నుంచి బహిష్కరించాలని కర్ణాటక హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

ఇది జరిగింది: కేరళకు చెందిన సిహాద్, పాకిస్థాన్ లోని కరాచికి చెందిన సమీరా అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. సిహాద్, సమీరా దంపతులు కుమారస్వామి లేఔట్ లో నివాసం ఉంటున్నారు. వివాహం అయిన తరువాత సమీరా వదిన కిరణ్ గుమాల్ (ఝునబ్), ఖాసీఫ్ శంశుద్దీన్ దంపతులను అక్రమంగా నేపాల్ మార్గంలో బెంగళూరు రప్పించింది.

నలుగురు బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ లో కాపురం పెట్టారు. పాకిస్థాన్ కు చెందిన దంపతులు అక్రమంగా నివాసం ఉంటున్నారని తెలుసుకున్న పోలీసులు 2017 మే 25వ తేదీన నలుగురిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.

సిహాద్, సమీరా వివాహం చేసుకున్నారని గుర్తించిన సెషన్స్ కోర్టు వారిని బెంగళూరులో నివాసం ఉండటానికి అవకాశం ఇచ్చింది. అక్రమంగా బెంగళూరులో నివాసం ఉంటున్న కిరణ్ గులామ్ ఆలీ, ఖాసిఫ్ శంశుద్దీన్ దంపతులకు 21 నెలల పాటు జైలు శిక్ష విదిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ దంపతులు మా శిక్షణ తగ్గించాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పాకిస్థాన్ దంపతుల అర్జీ అంతిమ వివాచరణ చేసిన హైకోర్టు ఏఫ్రిల్ 26వ తేదీన దంపతులను నగర బహిష్కరణ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.

English summary
Pakistani couple Kasif Shamsuddin and his wife Kiran Gulam Ali will hand over to Pakistan. Karnataka High Court order for extradition of illegal Pakistani couple who living in Bengaluru from 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X