వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ సరిహద్దుల్లో కలకలం..భారత గగనతలంపై పాక్ డ్రోన్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

డ్రోన్ ను పేల్చి.. పాక్ వెన్నులో వణుకు పుట్టించిన భారత్..!!

భుజ్: గుజరాత్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఉదయం కలకలం చెలరేగింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న గ్రామాలపై పాకిస్తాన్ సైన్యానికి చెందిన డ్రోన్ ఒకటి చక్కర్లు కొట్టింది. సుమారు అరగంట పాటు భారత గగనతలంలో అది తిరుగాడింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న మూడు గ్రామల ప్రజలకు ఈ డ్రోన్ కనిపించింది. దీనితో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ డ్రోన్ ను గుర్తించిన కొద్దిసేపటికే సరిహద్దు భద్రతా బలగాలు దాన్ని ధ్వంసం చేశాయి.

గుజరాత్ లో భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న కఛ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అబ్దాసా తాలూకా నాన్ఘతాద్ గ్రామ శివార్లలో ఈ ఉదయం పాకిస్తాన్ సైన్యానికి చెందినట్లుగా భావిస్తున్న ఈ డ్రోన్ భారత గగనతలంలోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన వెంటనే అప్రమత్తమైన సరిహద్దు భద్రతా బలగాలు దాన్ని ధ్వంసం చేశాయి. ఈ డ్రోన్ ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని సైనికాధికారులు తెలిపారు.

Pakistani drone shot down near Gujarat border

Pakistani drone shot down near Gujarat border

English summary
BHUJ: A Pakistani unmanned aerial vehicle (UAV) was on Tuesday shot down near the International Border in Kutch district of Gujarat, police sources said. Debris of the UAV was seen near Nanghatad village in Abdasa taluka of Kutch, they said. On hearing a loud sound around 6 am, villagers went to the spot and found the debris of the UAV, the sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X