వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దురాగతం: కాశ్మీర్‌లో మరోసారి ఎగిరిన పాక్ జెండాలు, పోలీసులపై రాళ్లు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీరలోని శ్రీనగర్‌లో వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. మరోసారి పాకిస్థాన్ జెండాలను ఎగరేశారు. పాకిస్థాన్‌కు అనుకూలంగా హురియత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పాకిస్థాన్ జెండాను పట్టుకుని ఊరేగింపుగా వెళ్లి బహిరంగ సభ నిర్వహించారు.

ఈ దురాగతమంతా వేర్పాటువాద నాయకుడు, హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ మద్దతుదారులు చేశారు. వేర్పాటువాదులు అంతటితో ఆగకుండా పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.

Pakistani flags raised in Kashmir, again

ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు సంబంధించిన జెండాలను కూడా ర్యాలీలో ప్రదర్శించారు.
వారిని అడ్డుకున్న భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వేర్పాటువాదులపై లాఠీ ఛార్జీ చేశారు.

జమ్మూ నుంచి కాశ్మీర్‌కు రాజధానిని తరలిస్తున్న నేపథ్యంలో ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు గురువారం ఆంక్షలు విధించారు. కాగా, తమ నేతల వర్ధంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించే అవకాశాలున్నాయనే సమాచారంతో ఫరూక్‌ను పోలీసులు బుధవారం హౌజ్ అరెస్ట్ చేశారు.

English summary
Pakistani flags were once again waved in Jammu and Kashmir on Friday. The supporters of Hurriyat chairman Mirwaiz Umer Farooq also raised terror organisation Lashkar-e-Toiba's flags and pelted stones at security forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X