వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం చేశారు, కానీ: మోడీకి పాక్ బాలిక లేఖ, ఏం చెప్పిందంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో ఓ పాకిస్థానీ బాలిక.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. పాకిస్థాన్‌కి చెందిన అకీదత్‌ నవీద్‌ అనే 11 ఏళ్ల బాల

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో ఓ పాకిస్థానీ బాలిక.. ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. పాకిస్థాన్‌కి చెందిన అకీదత్‌ నవీద్‌ అనే 11 ఏళ్ల బాలిక ఆ లేఖలో మోడీకి శుభాకాంక్షలు తెలిపింది.

అద్భుతం చేశారు..

అద్భుతం చేశారు..

బీజేపీ అద్భుత విజయంపై అభినందనలు తెలియజేసిన పాకిస్థానీ బాలిక, ఇదే మాదిరి మరింత మంది భారతీయుల, పాకిస్థానీ హృదయాలను గెలుచుకోవాలని సూచించింది. ఇరు దేశాల మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పాలని పేర్కొంది. తన లేఖలో అకిదత్ నవీద్.. భారత్, పాక్‌ల మధ్య శాంతి అవసరమనే సందేశాన్ని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి సాయపడాలని కోరింది.

శాంతిని కోరుకుందాం..

శాంతిని కోరుకుందాం..

‘ఓసారి మా నాన్న చెప్పారు.. ప్రజల హృదయాన్ని గెలుచుకోవడం ఓ అద్భుతమైన విషయం అని. బహుశా మీరు భారత ప్రజల మనసు గెలిచినందుకే యూపీ ఎన్నికల్లో విజయం సాధించారేమో. కానీ మీకో విషయం చెప్పాలి. మీరు ఇంకా ఎందరో భారతీయ, పాకిస్థాన్‌ ప్రజల మనసు గెలవాలంటే రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేలా చూసుకోవాలి. ఇక నుంచి బుల్లెట్లకు బదులు పుస్తకాలు, తుపాకులకు బదులు పేదల కోసం మందులు కొనాలి అన్న నినాదాన్ని పాటిద్దాం' అని లేఖలో పేర్కొంది అకీదత్‌.

అభినందనలు

అభినందనలు

శాంతినా.. సమస్యనా ఏది ఎంచుకోవాలో ఛాయిస్ మనదేనంటూ మోడీకి రాసిన లేఖలో అకీదత్ తెలిపింది. యూపీ ఎన్నికల్లో అద్భుతం విజయానికి అభినందనలు తెలుపుతూ తన సందేశాన్ని ముగించింది. లాహో‌ర్‌కు చెందిన ఈ బాలిక.. అంతకుముందు కూడా విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాసింది. ఆ లేఖలో కూడా ఇరుదేశాల మధ్య శాంతి సంబంధాలు మెరుగుపడాలని కోరింది.

మోడీ స్పందించే అవకాశం..

మోడీ స్పందించే అవకాశం..

ఇప్పుడు అకీదత్ రాసిన ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌లాగా మారింది. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వెళితే.. ఆయన తప్పక స్పందించే అవకాశం ఉంది.

English summary
Congratulating Prime Minister Narendra Modi for the Bharatiya Janata Party’s (BJP) historic mandate in the Uttar Pradesh Assembly Elections, an eleven year old Pakistani school girl wrote to him saying that he should now focus towards winning more hearts of Indians and Pakistanis alike, by becoming a bridge of peace between the two nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X