వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ లో పాకిస్థాన్ గుఢాచారి అరెస్టు
రాజస్థాన్: పాకిస్థాన్ కు చెందిన గూఢాచారిని భారత ఇంటిలీజెన్స్ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. పాకిస్థాన్ గుఢాచారి నందలాల్ మహరాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని అధికారులు చెప్పారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని మునాబో నుంచి నందలాల్ మహరాజ్ ఇండియాలోకి ప్రవేశించాడు. ఈ విషయం భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. జైసల్కేర్ సరిహద్దులో ఉన్న సుమారు 350 గ్రామాల్లో అతని కోసం గాలించారు.

చివరికి నందలాల్ మహరాజ్ ను అరెస్టు చేశారు. ఇతను అధికారులు మంజూరు చేసిన నిజమైన పాస్ పోర్ట్ తో భారత్ లోకి ప్రవేశించాడని పోలీసు అధికారులు చెప్పారు. భారత్ లో అక్రమంగా ఆయుధాలు సరఫరా చెయ్యడానికి నందలాల్ ప్రయత్నించాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.