వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై దాడులకు పాక్ ఉగ్రవాదుల కుట్రలు: అమెరికా ఆందోళన

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంోల భారతదేశంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద సంస్థలను పాక్ కట్టడి చేయకపోతే ఉగ్రమూకలు భారత్‌పై రెచ్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ట్రంప్‌తో భేటీ కానున్న మోడీ: జమ్మూకాశ్మీర్‌ అంశమే కీలకం, 45నిమిషాలపాటు చర్చ ట్రంప్‌తో భేటీ కానున్న మోడీ: జమ్మూకాశ్మీర్‌ అంశమే కీలకం, 45నిమిషాలపాటు చర్చ

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వంతోపాటు ఉగ్రవాదులూ వ్యతిరేకిస్తున్నారని తెలిపింది. భారత్‌లో పాక్ ఉగ్రవాదులు భారీ దాడులకు కుట్రలు పన్నారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలను పాక్ కట్టడి చేయకపోతే ఖచ్చితంగా దాడులకు తెగబడతారని స్పష్టం చేసింది.

 Pakistani terrorist organisation is planning to attack on India says US

అయితే, ఈ విషయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతుగా నిలుస్తుందని తాము అనుకోవడం లేదని అమెరికా రక్షణ శాఖ ఇండో-పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ శ్రీవర్ వ్యాఖ్యానించారు. చైనా మద్దతు కేవలం రాజకీయ, దౌత్యపరమైనవిగానే తాము భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్‌తో చర్చలు జరిపామని ఆయన తెలిపారు. చైనాతో భారత్ సత్ససంబంధాలనే కోరుకుంటోందని అన్నారు. అయితే ఇరు దేశాల మధ్య కొంత పోటీతత్వం, ఆందోళనలు కూడా ఉన్నాయని చెప్పారు.

పాక్‌కి షాకిచ్చిన సౌదీ
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు షాకిస్తూ.. జమ్మూకాశ్మీర్ విషయంలో భారత వైఖరిని సౌదీ అరేబియా సమర్థించింది. సౌదీ యువరాజ్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం సమావేశమై జమ్మూకాశ్మీర్ పరిణామాలను వివరించారు.

దాదాపు రెండుగంటలపాటు సాగిన ఈ భేటీలో జమ్మూకాశ్మీర్‌కు సంబంధించి భారత్ ఇటీవల తీసుకున్న చర్యలు, అక్కడి పరిణామాలపై అజిత్ ధోవల్ సౌదీ యువరాజుకు వివరించారు. జమ్మూకాశ్మీర్‌పై పాక్ చేస్తున్న దుష్ప్రచారాన్ని సౌదీ రాజు ముందు ఎండగట్టారు ధోవల్.

ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్ చేపట్టిన చర్యలపై సౌదీ యువరాజు సంతృప్తి వ్యక్తం చేస్తూ సానుకూలంగా స్పందించారు. జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్‌కు మద్దతుగా ఉంటామని చెప్పారు. తమకు మద్దతుగా నిలుస్తుందని అనుకున్న పాక్‌కి.. సౌదీ రాజు వ్యాఖ్యలు గట్టి షాకే ఇచ్చాయి.

English summary
The United States on Tuesday voiced fears of many countries that following abrogation of Jammu and Kashmir special status, Pakistani militants might launch terror strikes in India unless Pakistan "keep a lid on militant groups".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X