వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓవైపు పౌరసత్వ నిరసనలు: మరోవైపు పాకిస్థాన్ మహిళకు భారత పౌరసత్వం

|
Google Oneindia TeluguNews

Recommended Video

CAA 2019 : Pak Woman Receives Indian Citizenship In Gujarat || Oneindia Telugu

ద్వారకా: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఓ పాకిస్థానీ మహిళకు భారత పౌరసత్వం లభించింది. గుజరాత్ రాష్ట్రం భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన హసనా బెన్ అనే మహిళ 1999లో వివాహం అనంతరం పాకిస్థాన్‌కు వెళ్లింది.

 వర్క్ ఫ్రమ్ హోమ్: పౌరసత్వ ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు ఊడిపోతాయ్: సిబ్బందికి ఎమ్మెన్సీల వార్నింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్: పౌరసత్వ ఉద్యమాల్లో పాల్గొంటే ఉద్యోగాలు ఊడిపోతాయ్: సిబ్బందికి ఎమ్మెన్సీల వార్నింగ్

ఈ క్రమంలో ఆమె పాకిస్థాన్ పౌరసత్వం స్వీకరించింది. తన భర్త మరణించడంతో భారతదేశానికి తిరిగిరావాలని హసీనా నిర్ణయించుకుంది. రెండు సంవత్సరాల క్రితం భారత పౌరసత్వం కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆమె అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న భారత ప్రభుత్వం డిసెంబర్ 18న పౌరసత్వం మంజూరు చేసింది.

Pakistani woman granted Indian citizenship amid anti-CAA protests

ద్వారకా జిల్లా కలెక్టర్ డా నరేంద్ర కుమార్ మీనా హసీనాకు భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. కాగా, ఇటీవల పార్లమెంటు ఆమోదం తెలిపిన పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారిన విషయం తెలిసిందే.

కాగా, నాటి నుంచి దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమబెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశ రాజధానిలోనూ నిరసనలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తుండటంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఉత్తరప్రదేశ్, కర్ణాటకతోపాటు పలు యూనివర్సిటీల్లోని విద్యార్థులు కూడా పౌరసత్వ సవరణకు వ్యతిరకంగా ఆందోళనలకు దిగుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయులకు నష్టం లేదని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చట్టం కేవలంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశంలో హింసకు గురై మనదేశంలోకి శరణార్థులుగా మైనార్టీలకు పౌరసత్వం కల్పించేది మాత్రమేనని వివరించారు.

English summary
A woman from Gujarat who had settled in Pakistan after marriage and later relocated to India after her husband's death has been grated Indian citizenship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X