వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్ భవన్ బయట వాగ్వాదం: పళని సీఎం ఐనా.. పన్నీరుకు ఇంకా ఛాన్స్!

మొత్తానికి చూస్తే సోమవారం ఎవరైతే మద్దతు ఎక్కువ చూపితే వారికే సీఎం పీఠం శాశ్వతంగా దక్కనుంది. అంటే, పన్నీరు సీఎం సీఎం పీఠం ఆశలు పూర్తిగా మూసుకుపోలేదు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని రాజ్ భవన్ వెలుపల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి, ఈ రోజు వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం వర్గీయుల మధ్య గురువారం నాడు రగడ చోటు చేసుకుంది. ఇరువర్గీయులు వాగ్వాదం చేసుకున్నారు.

పన్నీరు కంటే స్ట్రాంగ్‌గా పళనిస్వామి: సీఎంగా ప్రమాణం, మంత్రులు వీరే..పన్నీరు కంటే స్ట్రాంగ్‌గా పళనిస్వామి: సీఎంగా ప్రమాణం, మంత్రులు వీరే..

మరోవైపు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి అమ్మ జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన రేపు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో చిన్నమ్మ శశికళను కలవనున్నారు.

ఇదిలా ఉండగా, తమిళనాట రాజకీయ డ్రామాకు తెరపడింది. పళనిస్వామి సీఎంగా ప్రమాణం చేశారు. ఇది పక్కన పెడితే సీఎంగా ప్రమాణం చేసిన పళని స్వామి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష పాస్ కావాల్సి ఉంది. సీఎంగా ప్రమాణం చేసినా ఆయన ఈ రెండు మూడురోజులు టెన్షన్ టెన్షన్‌‌గానే గడపనున్నారు.

panneerselvam

సోమవారం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ బల నిరూపణలో ఎవరు నెగ్గితే వారికే సీఎం పీఠం దక్కనుంది. ప్రస్తుతం పళనిస్వామి కూడా ఆపద్ధర్మ సీఎంగానే ఉంటారు.? ఈ బలనిరూపణకై గవర్నర్ విద్యాసాగర్ రావు 15రోజులు గడువిచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గడువు చాలా ఎక్కువే.

ఈ గ్యాప్‌‌లో ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పళనిస్వామికి కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే ఈ లోపు పన్నీర్ సెల్వం వైపు ఎమ్మెల్యేలు జంప్ కాకుండా చూసుకోవాలి. మరోవైపు పన్నీర్ సెల్వం శిబిరంలోని శాసన సభ్యులను తమవైపు లాక్కునేందుకు శశివర్గం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

తన టీంలో ఇప్పటికే ఉన్నవారితో పాటు మరో పదిమందిని తీసుకురాగలిగితే పన్నీర్ సెల్వంకు మద్దతిస్తామని డీఎంకే పార్టీ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా చూసినా అటూ ఇటూ పదిమంది ఎమ్మెల్యేలు కీలకంగా మారనున్నారు.

20 ఏళ్లకు.. గెలిచిందెవరు?: శశికళకు జైలు వెనుక.. ఆ 'ఒక్కడు'20 ఏళ్లకు.. గెలిచిందెవరు?: శశికళకు జైలు వెనుక.. ఆ 'ఒక్కడు'

అందుకే వీలైనంత త్వరలో ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని సోమవారం బలనిరూపణ చేసుకోనున్నారు.

మొత్తానికి చూస్తే సోమవారం ఎవరైతే మద్దతు ఎక్కువ చూపితే వారికే సీఎం పీఠం శాశ్వతంగా దక్కనుంది. అంటే, పన్నీరు సీఎం సీఎం పీఠం ఆశలు పూర్తిగా మూసుకుపోలేదు. అయితే, ఎమ్మెల్యేలు ఆయన వైపు లేకపోవడం గమనార్హం. ఫ్లోర్ టెస్టును మరింత ముందుకు జరిపి.. శనివారం నిర్వహించేందుకు పళనిస్వామి వర్గం చూస్తోంది.

English summary
Newly appointed Chief Minister of Tamil Nadu E Palanisamy will take a floor test on Saturday, February 18, the AIADMK said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X