హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ను పదేళ్లు యుటి చేయాలి: పల్లంరాజు

By Pratap
|
Google Oneindia TeluguNews

Pallam Raju demands Hyderabad as UT
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పడే వరకు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత (యూటీ) చేయాలని కేంద్రమంత్రి పల్లం రాజు డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో గందరగోళం నెలకొని సభ మధ్యాహ్నం 3గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత పల్లంరాజు మిడీయాతో మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులో సీమాంధ్ర ప్రజలకు ఎటువంటి హామీలు లేవని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్రలో ఆర్ధిక ద్రవ్యోల్భనం ఏర్పడే ప్రమాదం ఉందని పల్లంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ బిల్లులో హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంద్రుల రక్షణకు సంబంధించిన అంశాలేమి లేవని ఆయన విమర్శించారు. కేంద్రం తమ వాదన ను పట్టించుకోకుండా ముందుకు పోతే ఏం చేయాలన్న దానిపై తమ వ్యూహాలు తమకు ఉన్నాయని పల్లంరాజు వెల్లడించారు.

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్‌ను తెలంగాణ రాష్ట్రంలో ఉంచుతూ శాంతిభద్రతలను గవర్నర్ పరిధిలో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

English summary
union minister from Seemandhra Pallam Raju has demanded Hyderabad as UT.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X