వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్‌తో పాన్ లింక్ కాలేదా.. మరికొద్ది రోజుల్లో ఆ కార్డులు చెల్లవు..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఆధార్ కార్డుతో మీ పాన్ కార్డు లింక్ కాలేదా. అయితే వెంటనే అలర్ట్ అవాల్సిందే. ఆగస్టు 31లోగా పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోని పక్షంలో రద్దయ్యే ఛాన్సుంది. ఇంకా 50 రోజులు గడువు ఉండటంతో చివరి క్షణంలో హడావిడి పడకుండా ముందుగానే లింక్ చేసుకుంటే బెటర్. ఒకవేళ గడువు తేదీలోగా లింక్ చేయకుంటే మాత్రం ఆ పాన్ కార్డులు ఇకపై చెల్లవు. ఆ మేరకు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అధికారి ఒకరు వెల్లడించారు.

ఆధార్‌తో లింక్ లేని పాన్‌కార్డులు దాదాపు 20 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 43 కోట్ల మందికి పాన్‌కార్డులు ఉన్నాయని.. అందులో యాభై శాతం మాత్రమే ఆధార్‌తో లింకింగ్ కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆగస్టు 31వ తేదీలోగా అనుసంధానం చేసుకోవాలని సూచించారు.

 pan card link mandatory with aadhar last date is august 31st

మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)మంత్రికి వింత అనుభవం.. డబ్బా పీతలు తెచ్చి.. ఇంటిముందు కుమ్మరించి.. (వీడియో)

క్రెడిట్ కార్డులతో పాటు వివిధ రుణాలు పొందడానికి చాలామంది చట్టవిరుద్దంగా పాన్‌కార్డులు ఉపయోగించినట్లు బయటపడటంతో.. ఆధార్ కార్డుతో లింక్ చేయని పాన్ కార్డులను రద్దు చేయాలని ఐటీ డిపార్టుమెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 31లోగా లింక్ చేసుకోకుంటే.. ఆ పాన్‌కార్డులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి చెల్లవు. అదలావుంటే బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పాన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డుతో పన్ను చెల్లించే సౌలభ్యం ఉంటుందని చెప్పడం కొసమెరుపు.

English summary
Last Date For aadhar number with pan card linkage in August 31st. Otherwise those pan cards not working from september first.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X