వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు ఖాతాలకు పాన్ నెంబర్ లింక్ చేయాల్సిందే

నవంబర్ 8వ, తేది తర్వాత ప్రారంభించిన కొత్త బ్యాంకు ఖాతాలను పాన్ నెంబర్ తో అనుసందించాలని ఆర్ బి ఐ ఆదేశాలు జారీ చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్లధనాన్ని మార్చుకొనేందుకు అక్రమార్కులు పాల్పడితే వాటిని అడ్డుకొనేందుకుగాను రిజర్వ్ బ్యాంకు కొన్ని సూచనలు చేసింది పాన్ నెంబర్ ఇవ్వని వారి ఖాతాలను కొనసాగించకూడదని రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది.

పెద్ద నగదు నోట్ల రద్దు చేయాలని నవంబర్ 8వ, తేదిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తీసుకొన్న తర్వాత ఏ బ్యాంకులో కొత్తగా ఖాతాలను ప్రారంభించారో ,ఆ ఖాతాలపై రిజర్వ్ బ్యాంకు అధికారులు కన్నేశారు.

దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకుల ద్వారా కొందరు అక్రమార్కులు రద్దు చేసిన నగదును మార్చుకొన్నారు. అక్రమార్కులకు సహకరించిన బ్యాంకు అధికారులను గుర్తించి అదుపులోకి తీసుకొంటున్నారు ఉన్నతాధికారులు

అయితే ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు పంజాబులోని వ్యాపారికి 85 ఖాతాలున్న విషయాన్ని ఈడీ అధికారులు గుర్తించారు.ఏ ఖాతాలో ఎంత డబ్బుందనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

పాన్ నెంబర్ తప్పనిసరి

పాన్ నెంబర్ తప్పనిసరి

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత కొత్తగా ప్రారంభించిన ఖాతాల్లో ఎంత మేరకు నగదు జమఅయిందోననే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే కొత్తగా ప్రారంభించిన ఖాతాలకు పాన్ నెంబర్ ను అనుసంధానం చేయాలని రిజర్వ్ బ్యాంకు అన్ని బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది.కొత్తగా ప్రారంభించిన ఖాతాల్లో రెండు లక్షలకు పైగా నగదును డిపాజిట్ చేస్తే, వాటిని పాన్ నెంబర్ తో అనుసంధానం చేయకపోతే ఖాతాను ప్రారంభించకూడదని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది.లేదా ఫారం 60 నింపి బ్యాంకులో ఇవ్వాలని కోరారు.ఆర్ బి ఐ ఆదేశాలను పాటించని ఖాతాలను కొనసాగించకూడదని బ్యాంకర్లను ఆదేశించింది ఆర్ బి ఐ

నవంబర్ 8వ, తేదికి ముందు ఖాతాలు కూడ

నవంబర్ 8వ, తేదికి ముందు ఖాతాలు కూడ

పెద్ద నగదు నోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ,తేదికి ముందుగా ఆయా ఖాతాలను కూడ పాన్ కార్డుతో తప్పనిసరి చేయాలని ఆర్ బి ఐ కోరింది.కనీసం ఐదు లక్షల రూపాయాల కంటే ఎక్కు వ నగదు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులు తప్పనిసరిగా పాన్ నెంబర్లను తమ ఖాతాలకు అనుసంధానం చేయాలని బ్యాంకులకు ఆర్ బి ఐ ఆదేశాలు జారీ చేసింది.

ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉంటే

ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉంటే

బ్యాంకు ఖాతాలకు పాన్ నెంబర్ ను అనుసంధానించకపోతే ఒక్కో ఖాతాలో పెద్ద మొత్తంలో నగదును జమ చేసుకోనే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క దానికంటే ఎక్కు వఖాతాలను కలిగి ఉన్న సందర్భంలో ఒకే వ్యక్తి తన వేర్వేరు ఖాతాల్లో ఎంత నగదును జమ చేశారనే విషయాన్ని తెలుసుకొనే వీలుండదు. కాని, పాన్ నెంబర్ ను బ్యాంకు ఖాతాలకు అనుసందించడం ద్వారా ఒకటి కంటే ఎక్కు బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటే ఏ ఖాతాలో ఎంత నగదు జమ చేశారో సులభంగా తెలుసుకోవచ్చును.

అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు

అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు

నగదు రహిత విధానాన్ని ప్రోత్సహిస్తోంది కేంద్రం. అయితే బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై పన్నులు ఎగవేయకుండా ప్రతి ఖాతాదారుడు ఆదాయపన్ను చెల్లించకుండా పన్నును ఎగవేస్తున్నాడా,, పన్ను చెల్లిస్తున్నాడా అనే విషయాలు బయటపడనున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకు ఖాతాలకు పాన్ నెంబర్లను అనుసందించనున్నారు. కొత్తగా ప్రారంభించిన ఖాతాలతో పాటు పాత ఖాతాల్లో కూడ ఎంత నగదు ఉంది, ఆ నగదును ఎంత ఉంది. ఆ ఖాతాలను పాన్ నెంబర్లు అనుసంధించడం ద్వారా అక్రమార్కులకు చెక్ పెట్టే అవకాశం దక్కనుంది.

English summary
All accounts attach with pan numbers reserve bank order to all bankers, after nov 8 newly open accounts must and should attach pan number said rbi. if not attach pan number with account dont operate order rbi, all accounts must attach with pan cards above 5 lakhs rupees deposit in accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X