వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత యువతిపై రేప్: నిందితుడికి రూ. 51వేలు ఫైన్ విధించిన గ్రామ పెద్దలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్: మతిస్థిమితం లేని దళిత యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ యువకుడిపై కేసు పెట్టకుండా పంచాయితీ పెద్దలు రూ. 51వేలు పరిహరాన్ని చెల్లించాలని ఆదేశించారు. ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలోని చిట్టోఘడ్‌లో వెలుగు చూసింది.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని చిట్టోఘడ్‌ గ్రామంలో సీతారాం జాట్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని దళిత యువతిపై అత్యాచారం చేశాడు..అయితే ఈ ఘటనపై నిందితుడిపై కేసు పెట్టలేదు.

 Panchayat lets off Dalit’s rapist with Rs 51,000 fine in Rajasthan

ఈ ఘటనకు పాల్పడినందుకు గాను పంచాయితీ నిర్వహించారు. బాధితురాలి శీలానికి వెలకట్టారు. రూ.51వేలు చెల్లించాలని సీతారాం జాట్ ను ఆదేశించారు. మతిస్థిమితం లేని యువతిపై దారుణానికి పాల్పడిన యువకుడిపై కేసు పెట్టకుండా గ్రామపంచాయితీ పెద్దలు రూ.51 వేలు పరిహరం చెల్లించాలని తీర్పు ఇవ్వడాన్ని ఓ వ్యక్తి వీడియోగా రికార్డు చేశారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

పోలీసులు రంగంలోకి దిగడంతో నిందితుడు సీతారాం పారిపోయాడు. మరో వైపు మతిస్థిమితం లేకుండా పోయిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై కేసు పెట్టకుండా ఉండేందుకు రూ. 51 వేలు పరిహరం చెల్లించాలని తీర్పు చెప్పిన గ్రామ పంచాయితీ పెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Panchayat members of a village in Chittorgarh allegedly tried to shield an upper caste man, who had raped a mentally-unstable Dalit woman, by offering the survivor’s family a ‘settlement’ amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X