వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ayodhya verdict:నిరీక్షించిన స్వప్నం, పెరిగిన ప్రతిష్ట, సుప్రీంకోర్టు అయోధ్య తీర్పుపై రవిశంకర్

|
Google Oneindia TeluguNews

అయోధ్య వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ శ్రీ రవిశంకర్ తెలిపారు. తీర్పును అన్ని వర్గాలు స్వాగతించాయని ఆయన పేర్కొన్నారు. తీర్పును వ్యతిరేకిస్తున్నది కొందరు మాత్రమేనని స్పష్టంచేశారు. అయోధ్య వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు ధర్మాసనం నిష్పాక్షిపాతంగా తుది తీర్పును వెల్లడించిందని బెంగళూరులోని తన ఆశ్రమంలో మీడియాకు వివరించారు.

మధ్యవర్తిత్వ కమిటీ సభ్యులు

అయోధ్య భూవివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో మధ్యవర్తిత్వ కమిటీని కూడా నియమించింది. అయితే కమిటీ పరిష్కారం సూచించడం విఫలం కావడంతో 40 రోజులపాటు రోజువారీగా సుప్రీంకోర్టు విచారించిన సంగతి తెలిసిందే. కమిటీ పండిట్ రవిశంకర్ కూడా ఉన్నారు. అయోధ్య భూవివాదంపై కమిటీ ప్రజలతో కలిసినప్పుడు వ్యక్తమైన అభిప్రాయమే తీర్పులో సుప్రీంకోర్టు తెలిపిందని చెప్పారు.

చరిత్రాత్మకం..

చరిత్రాత్మకం..

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని రవిశంకర్ అభిప్రాయపడ్డారు. అత్యంత సున్నితమైన సమస్యకు సర్వోన్నత న్యాయస్థానం మంచి పరిష్కారం సూచించిందని తెలిపారు. అయోధ్య తీర్పుపై రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. సమాధానాన్ని రవిశంకర్ దాటవేశారు. కానీ సుప్రీంకోర్టు తీర్పును ప్రతీ ఒక్కరు గౌరవించాలని సూచించారు.

నిరీక్షించిన స్వప్నం..

నిరీక్షించిన స్వప్నం..

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని వేలాది మంది చూస్తున్నారని రవిశంకర్ చెప్పారు. వివాదాస్పద స్థలం నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో హిందుత్వ వాదుల కోరిక నెరవేరబోతుందని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం త్వరలో జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అందులో మీరు భాగస్వాముల అవుతారాని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. మరోసారి దాటవేశారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో శాంతి, సౌభ్రాతుత్వం పెంపొందించేందుకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని కోరారు.

పెరగనున్న ప్రతిష్ట

పెరగనున్న ప్రతిష్ట

అయోధ్య తీర్పుతో ప్రపంచ యవనికపై భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని రవిశంకర్ అభిప్రాయపడ్డారు. భిన్నత్వంలో ఏకత్వం విరాజిల్లుతున్న భారత్ మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. శాంతి, సౌభ్రాతుత్వం, సామరస్యానికి భారత్ ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు.

English summary
art of living founder pandit ravi shankar welcome supreme ayodhya verdict. this verdict historical he told to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X