• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లను నిషేధించండి -ధ్వని కాలుష్యం- కేంద్రానికి శివసేన డిమాండ్ -‘అజాన్-హారతి’ వివాదం

|

బీజేపీతో శివసేన దోస్తీ తెంచుకున్న తర్వాత మహారాష్ట్రలో హిందూత్వ ఛాంపియన్ షిప్ కోసం రెండుపార్టీల మధ్య హోరాహోరి పోరు జరుగుతోంది. కరాచీ బేకరీ పేరు మార్పుపై శివసేన బెదిరిస్తే.. కరాచీ ఏనాటికైనా భారత్ లో కలుస్తుందని, బేకరీ పేరు మార్చాల్సిన అవసరం లేదని బీజేపీ వాదించింది. తాజాగా శివసేనకు చెందిన కీలక నేత పాండురంగ్ సక్పాల్.. 'హిందూ ఆలయాల్లో హారతి పారాయణం, మసీదుల్లో అజాన్ పిలుపు పోటాపోటీగా సాగితే బాగుంటుంద'ని చెప్పడంతో.. శివసేన హిందూత్వకు మంగళంపాడిందంటూ బీజేపీ విరుచుకుపడింది. ఈక్రమంలో శివసన మళ్లీ బీజేపీకి కౌంటరిస్తూ..

శెభాష్ సంజయ్.. ఇదే జోరు ఎక్కడా తగ్గొద్దు: తెలంగాణ బీజేపీ చీఫ్‌కు ప్రధాని మోదీ ఫోన్ -రిగ్గింగ్

దేశవ్యాప్తంగా మసీదుల్లో లౌడ్ స్పీకర్ల వాడకం వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోతున్నదని, దమ్ముంటే.. వెంటనే వాటిని నిషేధించాలని శివసేన.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పార్టీ పత్రిక 'సామ్నా'లో బుధవారం నాటి ఎడిటోరియల్ లో ఈ మేరకు సేన సంచలన వ్యాఖ్యలు చేసింది. మతాల మధ్య సామర్యం ఉండాలంటూ తమ నేత సక్పాల్ చేసన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని సేన ఆరోపించింది.

Pandurang Sakpal Azaan row:shiv sena asks Centre to ban loudspeakers in mosques

''మీ(బీజేపీ) బుద్ధే ఇది. ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తోన్న రైతుల్ని పాకిస్తానీ టెర్రరిస్టులుగా బీజేపీ చిత్రీకరిస్తోంది. నిజానికి ఆ రైతుల్లో చాలా మంది మాజీ సైనికులు, ప్రస్తుతం సైన్యంలో ఉన్నవాళ్ల తండ్రులు కూడా ఉన్నారు. హారతి పారాయణంతోపాటే అజాన్ ఉండాలని మా నేత వ్యాఖ్యానిస్తే దానికి తప్పుడు అర్థాలు తీశారు..

షాకింగ్: గ్రేటర్ ఓటరు సత్తా -పోలింగ్ శాతం పెరిగింది -20ఏళ్ల రికార్డు బ్రేక్ -చివరి గంటలో అనూహ్యం

ఏం? ఇక్కడ నివసిస్తోన్న 22 కోట్ల మంది ముస్లింలు భారతీయులే కదా. బీజేపీ నేతలు ఈద్ వేడుకల్లో పాల్గొనడంలేదా? గోవధపై నిషేధం విధించామన్నారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్ అమ్మకాలు, వినియోగం యధావిధిగా కొనసాగడంలేదా? అనవసరంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం అవసరమా? మతవిద్వేషాలు తప్ప మీకేం పనిలేదా?'' అని సామ్నా ఎడిటోరియల్ లో శివసేన మండిపండింది.

English summary
The Shiv Sena on Wednesday demanded that the Centre take steps to stop the use of loudspeakers on mosques to curb noise pollution. An editorial in Sena mouthpiece 'Saamana' said the issue is of noise pollution and environment protection. The comments came amid a row over Shiv Sena's Mumbai- South vibhag pramukh (division head) Pandurang Sakpal's suggestion of holding an 'Azaan' recital competition for Muslim children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X