వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా - ఇండియా మధ్య పాంగాంగ్ త్సో తాజా ఘర్షణలు .. నేడు 3వ దఫా సైనిక చర్చలు .. సర్వత్రా ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

భారత్ చైనా సరిహద్దులలో ఉద్రిక్త వాతావరణం పీక్స్ కు చేరుకుంటుంది . ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గకుండా అతిక్రమణలకు పాల్పడటంతో ఇండియా , చైనాల మధ్య ఘర్షణ ఇంకా కొనసాగుతుంది. తూర్పు లద్దాఖ్ లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ ఆ చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోగా , చైనా తాము సరిహద్దులను అతిక్రమించలేదని పేర్కొంది . ఎప్పుడూ రివర్స్ గేర్ లో వెళ్లి కుట్రలకు పాలడుతున్న చైనాకు బుద్ధి చెప్పాలని భారత్ కూడా సమాయత్తం అయింది.

Recommended Video

#IndiaChinaStandoff: Indian Army దే తప్పు, వెనక్కెళ్లాలని China డిమాండ్
తాజా ఉద్రిక్తతలపై చుషుల్ లో బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు

తాజా ఉద్రిక్తతలపై చుషుల్ లో బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు

ఇదే సమయంలో తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో మరోమారు తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద తాజా వాగ్వివాదాలను పరిష్కరించడానికి భారత, చైనా మిలిటరీలు నేడు చుషుల్‌లో మూడో రౌండ్ చర్చలు ప్రారంభించారు. భారత వైపు చుషుల్‌లో ఉదయం 10 గంటలకు బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చ ప్రారంభమైందని సమాచారం . పాంగాంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున మూడు వివాదాస్పద ప్రదేశాలపై తాజా చర్చల అజెండాగా చర్చలు కొనసాగుతున్నాయి.

పరస్పర ఆరోపణలతో నిన్న 5 గంటలపాటు కొనసాగిన చర్చలు

పరస్పర ఆరోపణలతో నిన్న 5 గంటలపాటు కొనసాగిన చర్చలు

బ్లాక్ టాప్ మరియు హెల్మెట్ టాప్ సమీపంలో ఉన్న ప్రాంతాల్లో చైనా మోహరింపు గురించి భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. భారత దళాలు కూడా తమ పరిధిలోని కొండ శిఖరాలను ఆక్రమించాయని వారు వెనక్కి తగ్గాలని చైనా కోరుకుంటుంది.సోమవారం కూడా ఐదు గంటల పాటు ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. పాంగాంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున భారతీయ మరియు చైనా దళాలు వాగ్వివాదాలకు పాల్పడ్డాయి. వెనక్కు తగ్గే విషయంలో ఇరు వర్గాలు ఎవరి వాదన వారు వినిపిస్తూ భీష్మించుకు కూర్చున్నాయి . అక్కడ చైనా 450 మంది సైనికులను తీసుకొచ్చి యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించింది. ఇక ప్రత్యర్థి ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో భారత సైన్యం దీటుగా నిలబడింది.

వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దులు మార్చే యత్నం చేసిన చైనా .. అడ్డుకున్న భారత్

వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దులు మార్చే యత్నం చేసిన చైనా .. అడ్డుకున్న భారత్

పాంగాంగ్ త్సో యొక్క దక్షిణ ఒడ్డున బ్లాక్ టాప్ మరియు ఠాకుంగ్ హైట్స్ మధ్య టేబుల్ టాప్ ప్రాంతంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు తాడులు మరియు ఇతర అధిరోహణ పరికరాల సహాయంతో ఎక్కడం ప్రారంభించాయని భారత వర్గాలు తెలిపాయి. ఇక చైనా చేస్తున్న చర్యలను గుర్తించిన భారత సైన్యం అప్రమత్తమై చర్యలకు దిగింది. ఇంతకుముందు, వాస్తవిక నియంత్రణ రేఖ వెంట ఇతర ప్రాంతాలలో యథాతథ స్థితిని మార్చాలని చైనా యొక్క పిఎల్‌ఎ ప్రణాళికల గురించి భారత గూఢచార సంస్థలు భారత సైన్యాన్ని అప్రమత్తం చేశాయి. ఆ తరువాత, రెండు వైపుల ఘర్షణ చెలరేగినప్పటికీ చైనా ప్రయత్నాలకు భారత్ సమర్ధంగా అడ్డుకట్ట వేసింది . చైనా దళాలకు దీటుగా భారత దళాల బలాన్ని చూసినప్పుడు చైనా వెనక్కు తగ్గింది .

గత ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా ... ఇండియాపైనే చైనా నెపం

గత ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా ... ఇండియాపైనే చైనా నెపం

"రెండు దేశాల దళాలు ఇప్పటికీ కనుచూపు మేరలో తలపడటానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం . ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న సమయంలో చైనా బ్రిగేడ్ కమాండర్-స్థాయి సమావేశం జరుగుతోంది.

భారత సైన్యం ఆగస్టు 29 మరియు ఆగస్టు 30 మధ్య రాత్రి దొంగచాటుగా సరిహద్దుల్ని మార్చేసే ప్రయత్నం చేసింది. తిరిగి ఇండియాపైనే నెపం మోపింది చైనా. తూర్పు లడఖ్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభన సమయంలో సైనిక మరియు దౌత్యపరమైన ఒప్పందాలలో అంగీకరించిన మునుపటి ఏకాభిప్రాయాన్ని పిఎల్‌ఎ దళాలు ఉల్లంఘించాయని మరియు వాటిని మార్చడానికి రెచ్చగొట్టే సైనిక ఉద్యమాలు జరిగాయని చెప్పారు.

చర్చల ద్వారా శాంతికి యత్నం ... కాదంటే సమరమే

చర్చల ద్వారా శాంతికి యత్నం ... కాదంటే సమరమే

పాంగాంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున భారత దళాలు ఈ పిఎల్ఎ కార్యకలాపాలను ముందస్తుగా గ్రహించి చైనా ఉద్దేశాలను అడ్డుకునే చర్యలను చేపట్టాయి" అని ఫోర్స్ తెలిపింది. చర్చల ద్వారా శాంతి మరియు ప్రశాంతతను కాపాడుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని, కానీ భారతదేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కూడా సమానంగా నిశ్చయించుకున్నామని భారత సైన్యం పేర్కొంది. ఇక చైనా తమ దళాలు నియంత్రణ రేఖను దాటలేదని చెప్తున్న నేపధ్యంలో నేడు మరోమారు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఫైనల్ డెసిషన్ ఏమవుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.

English summary
India, China engage in 3rd military dialogue after fresh skirmishes at Pangong Tso. The Indian and Chinese militaries began the third round of talks at Chushul on Tuesday to resolve the fresh skirmishes at Pangong Lake in eastern Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X