• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Tattoo: చెయ్యి మీద 786 పచ్చబొట్టు, చెయ్యి అడ్డంగా నరికేశారు, లైంగిక వేధింపులు, అందుకే, అర్దరాత్రి !

|

హరియాణ/ పానిపట్: ముస్లీంలు ఎంతో పవిత్రంగా బావించే 786 అల్లాకు ప్రతిరూపం అని ముస్లీం సోదరులు భావిస్తారు. చేతిమీద 786 Tattoo (పచ్చబొట్టు) వేయించుకున్న పాపానికి ఓ ముస్లీం సోదరుడి చెయ్యి అడ్డంగా నరికేశారు. చెయ్యి నరికేయడమే కాకుండా తీవ్ర చిత్రహింసలుకు గురిచేసి అతని ప్రాణాలు పోయాయని భావించి తీసుకెళ్లి రైల్వే ట్రాక్ దగ్గర విసిరేశారు. అయితే ప్రాణాలతో బయటపడిన ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. 7 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చెయ్యడం వలనే మేము ముస్లీం వ్యక్తిపై దాడి చేశామని, తాము అతని చెయ్యి నరకలేదని కొందరు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. ముస్లీం సోదరులారా మీరు చెయ్యి మీద 786 అని గుర్తు వేసుకునే ముందు మాబాధ ఒకసారి వినండి అంటూ బాధితుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

Kangana: సీఎంతో చెస్ ఆడుతావా ? కంగనా నువ్వెంత ? హైకోర్టు లాయర్ దెబ్బతో ఎఫ్ఐఆర్, ఫేస్ బుక్ !

ఉద్యోగం కోసం వేట

ఉద్యోగం కోసం వేట

హర్యానాలోని ఇఖ్లాక్ సల్మాని సోదరుడు ఇక్రమ్ సల్మాని కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హర్యానాలోని సహారాన్పూర్ కు సమీపంలోని 33 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న నానౌటా ప్రాంతంలో నివాసం ఉంటున్న మంగలి ఇఖ్లాక్ సల్మాని (28) అనే యువకుడు పానిపట్ ప్రాంతంలో పొట్టకూటి కోసం పని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆగస్టు 23వ తేదీ రాత్రి పానిపట్ ప్రాంతంలోని పార్క్ సమీపంలో ఇఖ్లాక్ సల్మాని నిద్రపోయాడు.

చేతిమీద 786 టాటూస్

చేతిమీద 786 టాటూస్

ఇఖ్లాక్ సల్మాని చేతి మీద ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే 786 టాటూస్ వేసుకున్నాడు. రాత్రి నిద్రపోతున్న ఇఖ్లాక్ సల్మానిని నిద్రలేపిన ఇద్దరు వ్యక్తులు ఎవ్వడురా నువ్వు ? ఇక్కడ ఎందుకు ఉన్నావ్ ? నీది ఏ ఊరు ? నీకు ఇక్కడ ఏం పని ? అంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో ఇఖ్లాక్ సల్మాని చేతి మీద ఉన్న 786 లోగో చూసిన ఇద్దరు వ్యక్తులు అతన్ని చితకబాదేశారని ఆరోపణలు ఉన్నాయి.

 చేతిమీద 786 చూసి చెయ్యి అడ్డంగా నరికేశారు ?

చేతిమీద 786 చూసి చెయ్యి అడ్డంగా నరికేశారు ?

ఇఖ్లాక్ సల్మాని మీద దాడి చేసిన సమయంలో అతను కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో తాగడానికి నీళ్లు ఇవ్వాలని ఇఖ్లాక్ వేడుకున్నా ఆ వ్యక్తులు పట్టించుకోలేదని తెలిసింది. అక్కడి నుంచి పార్క్ సమీపంలోని ఓ ఇంటిలోకి ఇఖ్లాక్ సల్మానిని లాక్కెళ్లి అక్కడ ముగ్గురు వ్యక్తులతో పాటు ఇద్దరు మహిళలు రాళ్లు తీసుకుని ఇఖ్లాక్ సల్మాని తలమీద దాడి చేశారని, తరువాత అతని కుడి చేతి మీద ఉన్న 786 టాటూస్ చూసి రగిలిపోయి కత్తి తీసుకుని చెయ్యి నరికేశారని ఆరోపణలు ఉన్నాయని సమాచారం.

చచ్చాడని విసిరేశారు

చచ్చాడని విసిరేశారు

తలమీద రాళ్లతో దాడి చెయ్యడం, చెయ్యి నరికేయంతో ఇఖ్లార్ సల్మాని స్పృహ కోల్పోయాడు. ఇఖ్లాక్ సల్మాని చనిపోయాడని బావించిన వాళ్లు అతన్ని తీసుకెళ్లి కిషన్ పూర్ లోని రైల్వేట్రాక్ దగ్గర విసిరేసి వెళ్లిపోయారని బాధితుడి సోదరుడు ఇక్రమ్ సల్మాని ఆరోపిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన ఇఖ్లాక్ సల్మాని అటువైపు వెలుతున్న ఓ పాదచారి సహాయంతో మా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడని ఇక్రమ్ సల్మాని బోరున విలపించాడు.

బాలుడిపై లైంగిక దాడి.... అందుకే !

బాలుడిపై లైంగిక దాడి.... అందుకే !

ఇఖ్లాక్ సల్మాని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఈ ఆరోపణలు ఖండిస్తున్నారు. ఆ రోజు రాత్రి తన 7 ఏళ్ల మేనల్లుడిని ఇంటి నుంచి అర్దకిలోమీటరు దూరంలో ఉన్న నిర్జనప్రదేశంలోకి తీసుకెళ్లిన ఇఖ్లాన్ అతని లైంగికంగా చిత్రహింసలకు గురి చేశాడని, మేము వెళ్లి చూసే సరికి ఇఖ్లాక్ సల్మాని, బాలుడు ఇద్దరూ నగ్నంగా ఉన్నారని ఆరోపించారు. ఆ సంఘటన చూసి షాక్ కు గురై మేము ఇఖ్లాక్ సల్మానిపై దాడి చేశామని, ఇఖ్లాక్ ఎదురుదాడి చెయ్యడంతో బాలుడి మేనమామకు రెండు దవడ పళ్లు రాలిపోయాయని, ఆ సమయంలో అతను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడని, అతని చెయ్యి మాత్రం మేము కత్తిరించలేదని అంటున్నాడు.

14 రోజులకు ఎఫ్ఐఆర్

14 రోజులకు ఎఫ్ఐఆర్

ఈ సంఘటన జరిగిన 14 రోజుల తరువాత చాందిని బాగ్ పోలీస్ స్టేషన్ లో బాలుడి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు. బాలుడికి పానిపట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. ఇఖ్లాక్ సల్మాని మీద లైంగిక వేధింపుల చట్టం కింద కేసు నమోదు అయ్యిందని, కేసు విచారణలో ఉందని, ఈ కేసుకు మతం రంగు పులమకూడదని స్థానిక పోలీసు ఇన్స్ పెక్టర్ అంకిత్ నందాల్ అంటున్నారు. అయితే తన సోదరుడు ఇఖ్లాక్ సల్మాని చెయ్యి నరికి అతని జీవితం నాశనం చేశారని, తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అతని సోదరుడు ఇక్రమ్ సల్మాని పోలీసు అధికారులను వేడుకుంటున్నాడు.

English summary
Shock: Ikhlaq Salmani was first beaten up and then his hand with a ‘786’ tattoo was cut off with a saw by some assailants, his brother says. However, police say prima facie it appears that he had sexually assaulted a 7-year-old boy though the case is being investigated from all angles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X