వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ సమాధి వద్ద అర్థరాత్రి సెల్వం ఒంటరిగా ధ్యానం,ఎందుకంటే?

తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి పూట జయ సమాధి వద్ద ఒంటరిగా కూర్చొని ధ్యానం చేయడం కలకలం రేపుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్దకు ఒంటరిగా వచ్చిన తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయ సమాధి వద్ద ధ్యానం చేశాడు.

మంగళవారం రాత్రి పూట మెరీనా బీచ్ వద్ద ఉన్న జయ సమాధి వద్దకు పన్నీర్ సెల్వం ఒంటరిగా వచ్చాడు. అమ్మ సమాధి వద్దే ఆయన జయ సమాధి వద్దే ధ్యానం చేశాడు
అన్నాడిఎంకె శాసనసభపక్ష నాయకుడిగా శశికళ ఎన్నిక కావడంతో ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదించారు.మంగళవారం నాడు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.

panneer selvam

అయితే ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వచ్చే అవకాశం ఉన్నందున గవర్నర్ విద్యాసాగర్ రావు వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నారు.దీంతో శశికళ ప్రమాణస్వీకారం వాయిదా పడింది.

దటీజ్ శశికళ! మోడీకి లేఖలోనూ వ్యూహం: అందరినీ ఆశ్చర్యపరిచారుదటీజ్ శశికళ! మోడీకి లేఖలోనూ వ్యూహం: అందరినీ ఆశ్చర్యపరిచారు

అయితే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని మరోసారి త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి పూట ఒంటరిగా జయ సమాధి వద్దకు రావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

జయకు నమ్మినబంటుగా ఉన్న పన్నీర్ సెల్వం ఆమె సమాధి వద్దే రాత్రి పూట ధ్యానం చేయడం గమనార్హం.తమిళనాడులో క్షణ క్షణానికి నాటకీయ పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి.
సుమారు 40 నిమిషాల పాటు ఆయన జయ సమాధి వద్దే ధ్యానం చేశాడు. ఆయన ధ్యానం చేసిన తర్వాత అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.

English summary
tamil nadu chief minister O Panneer Selvam visits Jayalalitha grave yard on tuesday night.he sitting alone for the 40 minutes. he did meditation at jayalalithaa graveyard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X