వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళనిస్వామి, పన్నీర్ కుమ్ములాట, పార్టీ కార్యక్రమాలకు పన్నీర్ దూరం, ఢిష్యూం ఢిష్యూం!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరి మళ్లీ ఒక్కటి అయ్యాయి. అయితే ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య మళ్లీ విభేదాలు మొదలైనాయని, వారి వర్గాల మధ్య కుమ్ములాట మొదలైయ్యిందని వెలుగు చూసింది. తాజాగా తిరుప్పూర్ లో ఇరు వర్గాల కార్యకర్తలు గొడవ పడం అందుకు నిదర్శనం.

శశికళకు షాక్, పళని, పన్నీర్ వర్గంలోకి రెబల్ ఎమ్మెల్యేలు జంప్, మొదటికే మోసం, ఎలా!శశికళకు షాక్, పళని, పన్నీర్ వర్గంలోకి రెబల్ ఎమ్మెల్యేలు జంప్, మొదటికే మోసం, ఎలా!

Recommended Video

Narendra Modi in Chennai : PM Meets DMK Chief Karunanidhi

జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో ఏర్పడిన చీలికలు తమిళనాడు రాజకీయాలను అనూహ్య మలుపులు తిప్పాయి. వాటిలో భాగంగా మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే అమ్మ, పన్నీర్ సెల్వం నాయకత్వంలోని అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ శిభిరాలు విలీనమైన విషయం తెలిసిందే.

పన్నీర్ ను నిర్లక్షం చేస్తున్నారు

పన్నీర్ ను నిర్లక్షం చేస్తున్నారు

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధ్య విభేదాలు మాత్రం ఇంకా తొలగిపోలేదని మరో సారి వెలుగు చూసింది. పన్నీర్‌ సెల్వం వర్గాన్ని పళనిస్వామి వర్గం విస్మరిస్తూ పార్టీ, అధికారంలో వారికి ప్రాధాన్యత కల్పించడం లేదని, అందరినీ నిర్లక్షం చేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు ఉన్నాయి.

పళని, పన్నీర్ మానసికంగా దూరం

పళని, పన్నీర్ మానసికంగా దూరం

తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఒకటి అయినప్పటికీ వారు మానసికంగా మాత్రం కలవలేదని ఇటీవల పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ మైత్రేయన్‌ చేసిన ట్వీట్‌ సైతం వారి మధ్య విభేదాలను బయటపెట్టింది. ఆయన శనివారం రాత్రి తమిళనాడు గవర్నర్ ను కలవడం మరో చర్చకు దారి తీసింది.

అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమం

అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమం

మదురై జిల్లాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి తీసుకెళ్లిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మదురైలోని తిరుప్పూర్‌లో వంద అడుగుల అన్నాడీఎంకే పార్టీ పతాకస్తంభం ప్రారంభోత్సవం జరగింది.

సీఎం హాజరు, పన్నీర్ వర్గం!

సీఎం హాజరు, పన్నీర్ వర్గం!

తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ బీ. ఉదయకుమార్‌ ఆధ్వర్యంలో తిరుప్పూర్ లో ఏర్పాటు అయిన కార్యక్రమంలో పళనిస్వామి పతాకస్తంభాన్ని ఆవిష్కరించారు. మదురైలోనే ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ ఆయన మాత్రం కార్యక్రమంలో పాల్గొనలేదు. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన మదురై ఎంపీ గోపాలకృష్ణన్, ఎమ్మెల్యేలు మాణిక్యం, శరవణన్ తో సహ ఆ జిల్లా నాయకులు ఎవ్వరూ కార్యక్రమానికి హాజరుకాలేదు.

పన్నీర్ వర్గం పేర్లు మాయం!

పన్నీర్ వర్గం పేర్లు మాయం!

తిరుప్పూర్ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన పార్టీ బ్యానర్లు, పోస్టర్లలో పన్నీర్ సెల్వం పేరు, ఆయన మద్దతుదారుల పేర్లు మాయం అయ్యాయి. అంతే కాదు నామఫలకంలో సహ పన్నీర్ సెల్వం పేరు పెట్టకపోవడంతో వారి మధ్య విభేదాలకు ఈ కార్యక్రమం అద్దం పడుతోందని కార్యకర్తలు అంటున్నారు.

చివరి నిమిషంలో!

చివరి నిమిషంలో!

తిరుప్పూర్ లో కార్యక్రమం ప్రారంభం అయ్యే గంట ముందు నామఫలంలో మార్పులు చేశారు. పన్నీర్ సెల్వం పేరు చెక్కించిన నామఫలకం తీసుకు వచ్చి అక్కడ పెట్టారు. తరువాత మంత్రి ఆర్ బీ. ఉదయ్ కుమార్ పన్నీర్ సెల్వంను కలిసి కార్యక్రమానికి హాజరుకావాలని మనవి చేసినా ఆయన మాత్రం అక్కడి వెళ్లకుండా మౌనంగా నిరసన వ్యక్తం చేశారు.

 కార్యకర్తలు ఢిష్యూం ఢిష్యూం

కార్యకర్తలు ఢిష్యూం ఢిష్యూం

తిరుప్పూర్‌ లో జరిగిన అన్నాడీఎంకే పార్టీ కార్యక్రమంలో సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గాలకు చెందిన కార్యకర్తలు ఆదివారం బాహాబాహీకి దిగడం గమనార్హం. ఈ ఘటన రెండు వర్గాల్లో కిందిస్థాయి వరకు నెలకొన్న విభేదాలకు అద్దం పడుతోంది. మేమిద్దరం కలిసే పని చేస్తున్నామని, కార్యకర్తలు గొడవపడకూడదని పన్నీర్ సెల్వం మనవి చేశారు.

English summary
The rift between the EPS and OPS groups of the ruling AIADMK appears to have widened, after deputy chief minister O Panneerselvam, the chief coordinator of the party, skipped a function attended by chief minister Edappadi K Palaniswami, the joint coordinator of the AIADMK.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X