• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తప్పుడు ఆరోపణలు, కూతురుగా తండ్రి కోసం సేవ చేశా: హనీప్రీత్

By Narsimha
|

న్యూఢిల్లీ: తన తండ్రిపై, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ చెప్పారు. రామ్ రహీమ్ సింగ్ అరెస్టైన తర్వాత పోలీసులకు చిక్కకుండా హనీప్రీత్ సింగ్ తప్పించుకు తిరుగుతోంది. అయితే ఓ జాతీయ మీడియా ఛానల్‌కు హనీప్రీత్ ఇంటర్వ్యూ ఇచ్చారు.తనపై చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

డేరాబాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ బెయిల్ కోసం ఇటీవల ఢిల్లీలో లాయర్‌ను సంప్రదించారు. అయితే ఆమెను పట్టుకొనేందుకు వెళ్ళిన పోలీసులకు ఆమె చిక్కుండా తప్పించుకొన్నారు.

హనీప్రీత్ కోసం సిట్ ప్రత్యేకంగా గాలింపు చర్యలను చేపట్టింది. హనీప్రీత్‌కు హర్యానా పోలీసులు కొందరు సహకరిస్తున్నారని సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.ఈ కారణంగానే హనీప్రీత్‌సింగ్‌ కోసం దాడులు చేసే సమాచారం ముందుగానే ఆమెకు చేరిపోతోందనే అనుమానాలను సిట్ వ్యక్తం చేస్తోంది.

హనీప్రీత్ సింగ్ ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు విషయాలపై ఆమె మాట్లాడారు.తనతో పాటు తన తండ్రి డేరాబాబాపై వస్తోన్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.

మాపై ఆరోపణల్లో వాస్తవం లేదు

మాపై ఆరోపణల్లో వాస్తవం లేదు

తన తండ్రి అమాయకుడని డేరాబాబా దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు.అంతేకాదు తనపై, తన తండ్రిపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హనీప్రీత్ సింగ్ .డేరా బాబా అరెస్ట్ తర్వాత చోటుచేసుకొన్న పరిణామాల్లో తన పాత్ర లేదని ఆమె చెప్పారు.

భయపడి పారిపోలేదు

భయపడి పారిపోలేదు

''మీడియాలో హనీప్రీత్ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ సంఘటన తర్వాత హనీప్రీత్ భయపడి పారిపోయినట్టు మీడియా చూపిస్తోంది. ప్రస్తుతం నా మానసిక పరిస్థితిపై కనీసం మాట్లాడలేకపోతున్నానని హనీప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు.""36 రోజుల తర్వాత మీడియాతో మాట్లాడింది. మీడియాలో వస్తోన్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించింది.

దేశద్రోహిని ఎలా అవుతాను

దేశద్రోహిని ఎలా అవుతాను

నన్ను దేశద్రోహి అంటూ పిలవడం పూర్తిగా తప్పు. అనుమతి లేకుండా తండ్రితో పాటు కూతురు కోర్టుకు వెళ్లడం సాధ్యమయ్యే పనికాదని అని హనీప్రీత్ పేర్కొంది.

డేరాబాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఎట్టకేలకు మౌనం వీడింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన ఆవేదనను చెప్పుకొన్నారు. ‘జరిగిందంతా మీరే చూశారు. నేనేం నేరం చేశాను? ఒక కూతురు ఏం చేస్తుందో అదే నేను చేశానని హనీప్రీత్ చెప్పారు.

మీరే ప్రధాన సూత్రధారి

మీరే ప్రధాన సూత్రధారి

పంచకుల అల్లర్లకు మీరే ప్రధాన సూత్రధారి అనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. "నేను ఒక్కటే అడగదల్చుకున్నా... అంతమంది పోలీసులు ఉండగా ఓ అమ్మాయి అనుమతి లేకుండా ఎలా ఒంటరిగా వెళుతుంది? ఆ తర్వాత నేను తప్పు చేశానంటూ వాళ్లంతా అంటున్నారు. అల్లర్లలో నా హస్తం ఉందని లేనిపోని నిందలు వేస్తున్నారు.. కాని నాపై వాళ్ల దగ్గర ఏమైనా ఆధారం ఉందా?'' అంటూ హనీప్రీత్ సింగ్ ప్రశ్నించింది.''నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. అలాంటప్పుడు అల్లర్లలో నా ప్రమేయం ఉందని ఎలా చెబుతారు? అంతా బాగుంటుంది... సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాం అన్న ఉద్దేశ్యంతోనే మేము కోర్టుకు వెళ్లాం. కానీ అక్కడ తీవ్ర విధ్వంసం జరిగిపోయింది... కోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది... మా మైండ్ పని చేయడం మానేసింది. అలాంటి పరిస్థితుల్లో మేము అల్లర్లకు ఎలా కుట్ర చేస్తామని ఆమె ప్రశ్నించింది''

English summary
Over month after godman Gurmeet Ram Rahim Singh was convicted, his favourite angel Honeypreet who was absconding for the past 36 days has finally been found.In an exclusive interview with India Today, Honeypreet Insan bares it all.Speculations about her complicity were rife ever since her sudden dissappearance after the Ram Rahim Singh's arrest. Even as the entire nation is hooked on to how her story unfolds, here is an exclusive interview with India Today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X