వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడిలో నిజాలు రాయొద్దా ? ప్రకటనలు నిలిపివేయడంతో ఖాళీ ఫ్రంట్ పేజీతో పత్రికల నిరసన

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియాది కీ రోల్. శాసన, కార్యనిర్వహఖ, న్యాయశాఖ తర్వాత మీడియాదే కీలకపాత్ర. మీడియాను ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తారు. కానీ అలాంటి మీడియాకు జమ్ముకశ్మీర్ లో చుక్కుదురైంది. అదీ కూడా పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది జవాన్లు చనిపోయారని వార్త రాస్తే రెండు పత్రికలకు యాడ్స్ నిలిపివేసి తన వక్రబుద్ధిని చూపించింది జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్.

<strong>పుల్వామా దాడిలో ఎలక్ట్రీషియనే సూత్రధారన్న ఎన్ ఐ ఏ</strong>పుల్వామా దాడిలో ఎలక్ట్రీషియనే సూత్రధారన్న ఎన్ ఐ ఏ

మీడియాపై దాడి ..

మీడియాపై దాడి ..

సాధారణంగా రోజువారీగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి మీడియాలో కథనాలు వస్తుంటాయి. ప్రజలకు పత్రికలు పేపర్ ద్వారా, టీవీ విజువల్ ద్వారా ఇస్తుంటాయి. ఇందుకోసం ఓ వ్యవస్థే శ్రమిస్తోంది. అలాగే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మీడియా ప్రధాన ఆదాయం యాడ్స్. అలాంటిది కశ్మీర్ లో రెండు పత్రికలకు యాడ్స్ నిలిపివేయడంతో ఆందోళన చేపట్టారు.

ఖాళీ పేజీతో ఫ్రంట్ పేజీ

ఖాళీ పేజీతో ఫ్రంట్ పేజీ

జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ తీరును తప్పుపట్టాయి. ఆదివారం ఫ్రంట్ పేజీని ఖాళీగా అచ్చువేసి నిరసన చేపట్టాయి. కశ్మీర్ అబ్జర్వర్, కశ్మీర్ లీడర్, కశ్మీర్ విజన్, కశ్మీర్ మానిటర్ అనే డెయిలీ పేపర్లు ఖాళీ ఫ్రంట్ పేజీ అచ్చువేయించి .. తమ నిరసన తెలిపాయి.

 జోక్యం సరికాదు ..

జోక్యం సరికాదు ..

పత్రికల చట్టబద్దమైన విషయంలో జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ఎలా కల్పించుకుంటుందని మేధావులు ప్రశ్రిస్తున్నారు. ఇదీ పత్రికా ధర్మానికి .. నైతికతకు గొడ్డలిపెట్టు అని కశ్మీర్ ఎడిటర్స్ గిల్డ్ పేర్కొన్నది. ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదుచేసింది. పుల్వామా ఇష్యూలో స్థానిక మీడియా న్యూట్రల్ గా వ్యవహరించిందని కశ్మీర్ గిల్డ్ పేర్కొంది.

English summary
The Sunday Front page was blanketed and protested. The Kashmiri Observer, Kashmir Leader, Kashmir Vision, and Kashmir Monitor, a daily paper print out the empty front page and their protest. The intellectuals are wondering how the Jammu and Kashmir Administration can provide the legal aspect of magazines. This is the edict of the Kashmir Editor's Guild. To this extent the Press Council of India complained.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X