బీజేపీ నేత పరేశ్ రావల్‌కు కీలక పదవి - నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్మన్‌గా నియమించిన కేంద్రం
ప్రముఖ నడుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ లోక్ సభ సభ్యుడు పరేశ్ రావల్ కు కేంద్ర ప్రభుత్వం కీలక పదవిని కట్టబెట్టింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ)'కు ఆయనను చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన చేసింది.
1959లో సంతీత నాటక్ అకాడమీ స్థాపించిన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా దేశంలో థియేటర్ శిక్షణాలో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటూనే స్వతంత్ర వ్యవస్థగా పనిచేసే ఎన్ఎస్‌డీకి గత మూడేళ్లుగా ఫుల్ టైమ్ చైర్మన్ నియామకం జరగలేదు. రాజస్థానీ కవి, దర్శకుడు అర్జున్ దేవ్ చరణ్ ప్రస్తుతం యాక్టింగా చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు.

ఎన్ఎస్‌డీ నూతన చైర్మన్ గా నియమితుడైన పరేశ్ రావల్ ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగే వీలుంటుంది. నియామక ప్రకటనతోపాటే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరేశ్ కు శుభాభినందనలు సైతం తెలిపింది. ''నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్‌గా నియమితులైనన ప్రఖ్యాత భారతీయ సినీ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత పరేశ్ రావల్ కు హృదయపూర్వక అభినందనలు. మీ సమర్థవంతమైన నాయకత్వంలో ఎన్ఎస్‌డీ కచ్చితంగా ఉన్నత శిఖరాలకు చేరుతుంది'' అని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications