బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో కారు కొంటున్నారా...అయితే కండీషన్ అప్లై

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మీరు బెంగళూరులో నివసిస్తున్నారా...? అక్కడ కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు తప్పకుండా పార్కింగ్ స్థలం ఉండాల్సిందే. లేకుంటే మీరు ఎంత డబ్బులు పోసిన కారు మాత్రం మీకు దక్కదు. ఏంటి అవాక్కయ్యారా...? ఇది నిజం.కర్నాటక కొత్త ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధన ఎప్పుడు తీసుకొస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ మరీ ఎక్కువైపోతోంది. అంతేకాదు నివాస ప్రాంతాల్లో కూడా సరైన పార్కింగ్ లేక ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్క్ చేస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అదేమిటంటే... కారు కొనాలనుకునేవారు ముందుగా పార్కింగ్ స్థలం చూపించాల్సిందేనంటూ ఓ కొత్త నిబంధనకు శ్రీకారం చుట్టే యోచనలో ఉంది. ఇందుకోసం రవాణాశాఖతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. అంతా ఓకే అనుకుంటే ఏ క్షణమైనా ఈ నిబంధన అమలయ్యే అవకాశముంది.

Parking space must, if you want to buy a car in Bengaluru

ప్రైవేట్ వెహికల్స్‌తో విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోతోందని.. పైగా అడ్డగోలు పార్కింగ్‌లతో మరింత ఇబ్బంది ఎదురవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్లు ప్రజలకోసం మాత్రమే ఉన్నాయని వ్యక్తులకు కాదని భావించిన ప్రభుత్వం... ఈ కొత్త నిబంధన వస్తే చాలామంది ప్రజారవాణావైపు మొగ్గు చూపుతారనే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తమ్మన్న తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో ఏ నగరంలో ఇలాంటి నిబంధనలేదు. 2016 సమయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఇలాంటి ఆలోచనకు బీజం వేసినప్పటికీ.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఇంటి బయట కారు పార్కింగ్ చేస్తే కొంత రుసుము చెల్లించాలనే నిబంధన ఉంది. మరోవైపు కార్ పార్కింగ్ స్పేస్ సర్టిఫికేట్ ఉంటేనే కారు కొనుగోలు చేయాలనే నిబంధన జపాన్ దేశంలో ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.

English summary
Parking space must, if you want to buy a car in Bengaluru
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X